తాగునీటి పథకం పంపు హౌజ్ ను ప్రారంభించని ఎమ్మెల్యే పెద్దారెడ్డి

0 12

తాడిపత్రి  ముచ్చట్లు:
తాడిపత్రి నియోజకవర్గంలోని ప్రజలకు తాగునీటి కష్టాలు లేకుండా చేస్తామని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి పేర్కొన్నారు. శనివారం అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండల పరిధిలోని కోటకొండ గ్రామం వద్ద ఉన్న జేసీ నాగిరెడ్డి తాగునీటి పథకం సంబంధించిన పంప్ హౌస్ ను ఆయన ప్రారంభించారు. ముందుగా కోటకొండ గ్రామం చేరుకున్న ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి కోటకొండ ఆంజనేయ స్వామి వారిని దర్శించుకొని అక్కడ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. పూజా కార్యక్రమాల అనంతరం ఆయన పంప్ హౌస్  వద్దకు చేరుకుని పంప్ హౌస్ నందు గల మోటార్ స్విచ్ లను ఆన్ చేసి మోటర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకుల స్వార్థ రాజకీయాల వలన నియోజకవర్గంలో ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయాయి అన్నారు. అది చేస్తాం…. ఇది చేస్తామని మాయమాటలు చెప్పి స్వయంగా వారి తండ్రి పేరు మీద ఒక పథకాన్ని తీసుకు వచ్చి అందులోనూ కమిషన్ దండుకుని మొత్తం సర్వనాశనం చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తండ్రి పేరు పెట్టి ఆయన పేరును శాశ్వతంగా నిలబెట్టాల్సిన కొడుకులు కమీషన్లకు కక్కుర్తిపడి కోట్లు దండుకున్నారని…. అలాంటి  వారు లోకంలో ఎక్కడైనా ఉంటారా అని ఎద్దేవచేశారు. అదేవిధంగా ఆయన ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో మాట్లాడుతూ పెద్దవడుగూరు మండలంలో జేసీ నాగిరెడ్డి తాగునీటి పథకానికి సంబంధించి పెండింగ్లో ఉన్న పనుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తిచేయాలని ఆయన అధికారులకు సూచించారు.

జిల్లా ఎంపీడీవోల సంఘ నాయకుడు లక్ష్మీపతినాయుడు మృతి

 

- Advertisement -

Tags:MLA Peddareddy who did not start the drinking water scheme pump house

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page