తిరుమలలో అదనపు ఈఓ విస్తృత తనిఖీలు

0 16

తిరుమల   ముచ్చట్లు:

- Advertisement -

టిటిడి అదనపు ఈఓ శ్రీ ఎవి.ధర్మారెడ్డి శనివారం సాయంత్రం తిరుమలలోని పలు ప్రాంతాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.జి.ఎన్.సి, హెచ్.వి.సి, ఏ.ఎన్.సి, ఎస్.ఎన్.సి, ఎస్.ఎన్.ఆర్.హెచ్, ఎస్.ఎం.సి ప్రాంతాల్లో కాటేజీలను పరిశీలించారు. కాటేజీల అభివృద్ధి పనుల ప్రగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాటేజీల వెనుక, మధ్యభాగాల్లో చెత్తను తొలగించి పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఈ ప్రాంతాల్లో పచ్చదనం పెంచి ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాలని సూచించారు.
అదనపు ఈఓ వెంట ఈఈలు శ్రీ జగన్ మోహన్ రెడ్డి, శ్రీ శ్రీహరి, డిఇ శ్రీమతి సరస్వతి, గార్డెన్ డెప్యూటీ డైరెక్ట‌ర్ శ్రీ శ్రీ‌నివాసులు, డిఎఫ్‌వో శ్రీ చంద్ర‌శేఖ‌ర్‌, రిసెప్ష‌న్‌ డెప్యూటీ ఈవోలు శ్రీ లోక‌నాథం, శ్రీ భాస్క‌ర్‌, ఆరోగ్య శాఖాధికారి డాక్ట‌ర్ సునీల్ త‌దిత‌రులు ఉన్నారు.

 

జిల్లా ఎంపీడీవోల సంఘ నాయకుడు లక్ష్మీపతినాయుడు మృతి

Tags:Extra EO extensive inspections in Thirumala

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page