తెలంగాణలోనూ ఫోన్ ట్యాపింగ్

0 4

హైదరాబాద్  ముచ్చట్లు:
లంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం. తెలంగాణ సర్కార్ కూడా ఫోన్ ట్యాపింగ్‌కు పాల్పడుతుందని ఆయన ఆరోపించారు. ప్రజల కోసం పని చేసే మానవ హక్కుల నేతలు, ప్రతిపక్ష నాయకులు, జర్నలిస్ట్‌లపై పెగాసస్‌ను వాడుతూ గోప్యతా హక్కును హరిస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఇలాంటి చర్యలకు వ్యతిరేకంగా సంఘటితమై పోరాడాల్సిన అవసరం ఉందని ఆయన పిలుపునిచ్చారు.ఇటీవల కాంగ్రెస్‌లో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కలకలం రేపింది. ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్‌కు పాల్పడుతున్నారంటూ తెలంగాణ కాంగ్రెస్ నేతలంతా ధర్నాకు సైతం దిగారు. తన ఫోన్ ట్యాప్ చేశారంటూ రాహుల్ గాంధీ చెప్పిన విషయం తెలిసిందే. దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన పెగాస‌స్ స్పైవేర్ హ్యాకింగ్ గురించి ఆయ‌న స్పందించారు. త‌న‌కు చెందిన అన్ని ఫోన్ల‌ను ట్యాపింగ్ చేశార‌ని ఆరోపించారు. రాహుల్ గాంధీ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. త‌న ఫోన్ ట్యాప్ అయింద‌ని, ఇదొక్క‌టే కాదు అన్ని ఫోన్లు ట్యాపింగ్ కు గురైన‌ట్లు చెప్పారు.

 

జిల్లా ఎంపీడీవోల సంఘ నాయకుడు లక్ష్మీపతినాయుడు మృతి

- Advertisement -

Tags:Phone tapping in Telangana too

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page