పుంగనూరులో దిశయాప్‌తో మహిళలను కాపాడుకుందాం – సీఈవో ప్రభాకర్‌రెడ్డి

0 24

పుంగనూరు ముచ్చట్లు:

 

 

మహిళలందరిలోను చైతన్యం తీసుకొచ్చి దిశయాప్‌తో మహిళలకు ఎలాంటి సమస్యలు లేకుండ కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరు చర్యలు తీసుకోవాలని జెడ్పీ సీఈవో ప్రభాకర్‌రెడ్డి కోరారు. శనివారం వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, మండల అభివృద్ధి కమిటి అధ్యక్షుడు అక్కిసాని భాస్కర్‌రెడ్డితో కలసి సీఈవో దిశయాప్‌పై అవగాహన సదస్సు నిర్వహించారు. సందర్భంగా కరపత్రాలను విడుదల చేశారు. సీఈవో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో రూపొందించిన దిశయాప్‌ను మహిళలు ప్రతి ఒక్కరు డౌన్‌లోడ్‌ చేసుకుని ఎస్‌వోఎస్‌ సిస్టమ్‌ ద్వారా వినియోగించుకోవాలన్నారు. మహిళలకు ఎలాంటి సమస్యలు ఎదురైనా దిశయాప్‌ ద్వారా క్షణాలలో రక్షణ కల్పించడం జరుగుతుందన్నారు. మహిళలకు తగిన రక్షణ కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఈ యాప్‌ పట్ల మహిళలలో చైతన్యం తీసుకొచ్చి , ప్రతి ఒక్కరు వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి, మంత్రి పిఏ మునితుకారం, ఎస్‌ఐ ఉమామహేశ్వరరావు, ఇన్‌చార్జ్ ఎంపీడీవో రాజేశ్వరి , మాజీఎంపీపీ నరసింహులు, మాజీఏఎంసీ చైర్మన్‌ అమరనాథరెడ్డి, పార్టీ నాయకులు జయరామిరెడ్డి, చంద్రారెడ్డి యాదవ్‌ పాల్గొన్నారు.

- Advertisement -

జిల్లా ఎంపీడీవోల సంఘ నాయకుడు లక్ష్మీపతినాయుడు మృతి

Tags: Let’s protect women with direction in Punganur – CEO Prabhakar Reddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page