పుంగనూరులో మాస్క్ లు లేకపోతే ….. రూ.100 చలాన కట్టాల్సిందే..!-కమిషనర్‌ కెఎల్‌.వర్మ

0 23

పుంగనూరు ముచ్చట్లు:

 

మున్సిపాలిటి పరిధిలో వ్యాపారస్తులు, ప్రజలు మాస్క్ లు లేకుండ తిరిగితే రూ.100 లు చలనా కట్టితీరాల్సిందేనని కమిషనర్‌ కెఎల్‌.వర్మ హెచ్చరించారు. శనివారం పట్టణంలో సచివాలయ ఉద్యోగులు, వలంటీర్లు మాస్క్ లేకుండ తిరిగేవారికి రూ.100 లు ఫైన్‌ విధించారు. అలాగే వ్యాపారులు మాస్క్ లు ధరించకపోయినా, మాస్క్ లు లేనివారిని అనుమతించినందుకు రూ.500 లు జరిమాన విధించారు. కమిషనర్‌ మాట్లాడుతూ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , జిల్లా కలెక్టర్‌ హరినారాయణ్‌ ఆదేశాల మేరకు కరోనా నియంత్రణలో భాగంగా మాస్క్ లు లేనివారికి జరిమానాలు విధిస్తున్నామన్నారు. తొలిరోజు 36 మందికి జరిమానాలు విధించామన్నారు. ఇందులో వ్యాపారులు 5 మందికి ఒకొక్కరికి రూ.500లు వేసినట్లు ఆయన తెలిపారు. పట్టణ ప్రజలు మాస్క్లు ధరించి, కరోనాను నియంత్రిస్తారో… లేక జరిమానాలు కట్టి, ప్రాణాలకు ముప్పుతెచ్చుకుంటారో వారే నిర్ణయించుకోవాలన్నారు. పట్టణంలో నిబంధనలు ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్లు సఫ్ధర్‌ , సురేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

జిల్లా ఎంపీడీవోల సంఘ నాయకుడు లక్ష్మీపతినాయుడు మృతి

 

Tags: If there are no masks in Punganur ….. you have to pay Rs.100 ..! – Commissioner KL Verma

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page