మొక్కల  సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత,జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత

0 11

జగిత్యాల  ముచ్చట్లు:

మొక్కల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యతని  జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత అన్నారు. శనివారం రాష్ట్ర  ఐటి పురపాలక మరియు  పరిశ్రమల శాఖ మంత్రి  కేటిఆర్ జన్మదినం పురస్కరించుకొని  చేపట్టిన  ముక్కోటివృక్షార్చన   కార్యక్రమంలో బాగంగా  సారంగపూర్ మండలం  పోతారం గ్రామ శివారులో అటవీ ప్రాంతంలో   జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మేల్యేతో కలిసి  మొక్కలు నాటారు.   అటవీ పునరుద్దరణలో భాగంగా  జిల్లాలో   50 వేల మొక్కలు నాటి సంరక్షించే దిశగా  చర్యలు తీసుకుంటున్నామని   తెలిపారు.   ప్రియతమ నాయకుడు  కేటిఆర్ పుట్టిన రోజు నేపథ్యంలో   పెద్ద ఎత్తున మొక్కలు నాటుతున్నామని, వీటిని సంరక్షించే బాధ్యత స్థానిక ప్రజల  పై ఉందని ఆమె  అన్నారు. ఈ సందర్భంగా  జిల్లా వ్యాప్తంగా  380 గ్రామాలో పెద్ద ఎత్తున  మొక్కల నాటే  కార్యక్రమం చేపట్టామని తెలిపారు.

- Advertisement -

జిల్లా కలెక్టర్  మాట్లాడుతూ  పుట్టినరోజు సందర్భంగా  మంత్రికి శుభాకాంక్షలు తెలియజేసారు.    రాజ్యసభ సభ్యుడు  సంతోష్ చేపట్టిన  గ్రీన్ చాలెంజ్ లో భాగంగా మంత్రి పిలుపు మేరకు  ముక్కోటి వృక్షార్చన  కార్యక్రమం జగిత్యాల  జిల్లాలో పకడ్భందిగా నిర్వహిస్తున్నామని  కలెక్టర్  తెలిపారు.   ముక్కొటి వృక్షార్చనలో భాగంగా మొక్కలు నాటి వాటి సంరక్షణకు చర్యలు  తీసుకుంటున్నామని, స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేస్తు  చర్యలు చేపట్టామని కలెక్టర్  తెలిపారు.

కార్యక్రమంలో పాల్గోన్న  జగిత్యాల  ఎమ్మేల్యే డా.సంజయ్ కుమార్ మాట్లాడుతూ  గతంలో ఎన్నడు లేని విధంగా   నూతన   రాష్ట్రం ఏర్పడిన తరువాత పెద్ద ఎత్తున  మొక్కలు నాటి వాటి సంరక్షణ చర్యలు చేపట్టామని   తెలిపారు. 230 కోట్ల మొక్కల  నాటడమే లక్ష్యంగా   హరితహారం  కార్యక్రమాన్ని  సీఎం ప్రారంభించారని అన్నారు. ప్రస్తుత సంవత్సరం 19 కోట్లకు పైగా నూతన మొక్కలు   రాష్ట్ర వ్యాప్తంగా నాటుతున్నామని, జిల్లాలో యాదాద్రి తరహాలో మియవాకి ప్లాంటేషన్ చేస్తున్నామని ఎమ్మేల్యే తెలిపారు.   ప్రతి గ్రామపంచాయతిలో నర్సరీ  ఏర్పాటు చేసుకున్నామని,  జగిత్యాల పట్టణంలో 10 లక్షల మొక్కల పెంపక సామర్థ్యంతో  మెగా నర్సరీ ఏర్పాటు చేసుకుంటున్నామని  ఎమ్మేల్యే  తెలిపారు.  పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ పుట్టిన రోజు సందర్భంగా   రాజ్యసభ సభ్యుడు  చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ లో భాగంగా  ముక్కోటివృక్షార్చన  కార్యక్రమం చేపట్టామని,  జగిత్యాల నియోజకవర్గం  పరిధిలో 3 లక్షల మొక్కలను ప్రజాప్రతినిధులు,  అధికారుల సమన్వయంతో నాటుతున్నామని  తెలిపారు.

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రశేఖర్  గౌడ్,  జిల్లా అటవీ అధికారి వెంకటేశ్వర్ రావు, సర్పంచ్,లు జడ్పీటిసిలు, ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికరులు తదితరులు ఈ  కార్యక్రమంలో  పాల్గోన్నారు.

జిల్లా ఎంపీడీవోల సంఘ నాయకుడు లక్ష్మీపతినాయుడు మృతి

 

Tags:Plant care is everyone’s responsibility, Zadpi Chairperson Dawa Vasantha

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page