రోడ్లపై వరినాట్లు

0 6

జుక్కల్ ముచ్చట్లు:

ఇటీవల కురిసిన వర్షాలకు మండలం లోని అనేక గ్రామాలలో రహదారులు దెబ్బ తిన్నాయని వాటిని అధికారులతో పాటు ,జుక్కల్ ఎమ్మెల్యే హన్మంతు షిండే మరమ్మతులు చేయించడం లేదంటూ పిట్లం మండలం తిమ్మానగర్ తాండ వద్ద రహదారిపై వరి నాటు వేసి నిరసన తెలిపారు పిట్లం మండలం కాంగ్రెస్ నాయకులు.ముఖ్యంగా తిమ్మానగర్ నుండి మార్దంద వెళ్లే రహదారి అధ్వాన్నంగా మారి ప్రయాణానికి కష్టంగా మారిందని, అధికారులకు జుక్కల్ ఎమ్మెల్యే  హన్మంతు షిండే కు విన్నపాలు చేసిన పట్టించుకోక పోవడంతో ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టామని కాంగ్రెస్ నేతలు తెలిపారు.పిట్లం మండలంలోని తిమ్మా నగర్ గ్రామం నుండి మార్థండ వెళ్లే రహదారి ఇటీవల కురిసిన వర్షాలకు గుంతల మయంగా మారిందని, ఈ రహదారి గుండా తిమ్మానగర్ తాండ,ఖంభాపూర్,మార్థంద గ్రామాలతో పాటు సంగా రెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల వాసులు రాక పోకలు కొనసాగిస్తుంటారు. వర్షాలకు రహదారి దెబ్బ తిని వాహనాలు వెళ్లాలంటే ఇబ్బందులు ఎదురౌ తిన్నాయని,అధికారులకు ఎన్ని సార్లు విన్నవించినా ఫలితం లేక పోవటంతో అధికారుల,జుక్కల్ ఎమ్మెల్యే హన్మంతు షిండే తీరుకు నిరసనగా రహదారిపై వరి నాటు వేసి నిరసన తెలిపినట్లు కాంగ్రెస్ నాయకులు తెలిపారు. ప్రభుత్వం ఇప్పటికైనా రహదారులు మరమ్మతులు చేయించాలని లేదంటే రానున్న రోజుల్లో ఆందోళన ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

 

- Advertisement -

జిల్లా ఎంపీడీవోల సంఘ నాయకుడు లక్ష్మీపతినాయుడు మృతి

 

Tags:Rain on the roads

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page