వార్డు మహిళా పోలీసుల పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన రూరల్ ఎస్పీ

0 13

గుంటూరు    ముచ్చట్లు:
గుంటూరు జిల్లా పరిధిలోని గ్రామ/వార్డు సచివాలయ మహిళా పోలీసులకు శాఖా పరమైన పరీక్షల ను నిర్వహించేందుకు  గుంటూరులోని టీజేపీఎస్  కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని రూరల్ ఎస్పీ  విశాల్ గున్ని పరిశీలించారు. పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. ఎస్పీ మాట్లాడుతూ   గుంటూరు జిల్లా వ్యాప్తముగా ఉన్న 314 మంది వార్డు/గ్రామ సచివాలయ మహిళా పోలీస్ సిబ్బంది అందరికి పోలీస్ శాఖ యొక్క విధులు మరియు భాద్యతల గురించి,అదే విధముగా మహిళల, పిల్లల సంరక్షణ,  భాద్యతల గురించి ఆన్ లైన్ శిక్షణ ఇచ్చామని అన్నారు. ఆ శిక్షణకు సంబంధించి పరీక్షలు నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణముగా ఈ నెల 31వ తేదీన పరీక్ష నిర్వహిస్తామని అన్నారు.  పోలీస్ శాఖ విధులు, భాద్యతలకు సంబంధించి ఒక ప్రశ్న పత్రం, మహిళా, బాలల రక్షణకు సంబంధించి ఒక ప్రశ్న పత్రం మొత్తం మీద రెండు ప్రశ్న పత్రాలు ఇవ్వడం జరుగుతుందని అన్నారు.

ఒక్కో ప్రశ్న పత్రము గరిష్టంగా 100 మార్కులకు ఉంటుందని, ఒక్కో ప్రశ్న పత్రానికి  2 గంటల 30 నిముషాల సమయం ఇస్తామని అన్నారు. మొదటి పరీక్షా ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మరియు రెండవ పరీక్షా మధ్యాహ్నం 3 గంటల నుండి 5:30 గంటల వరకు ఉంటుంది.  చేతి వ్రాత పూర్వకముగా జరిగే ఈ పరీక్షకు సచివాలయ మహిళ పోలీస్ సిబ్బంది పరీక్షా కేంద్రములోనికి నిర్దేశిత సమయములోపు చేరుకోవాలని,ప్రతి ఒక్కరు మాస్క్ తప్పని సరిగా ధరించడం, సానీటైజర్ ఉపయోగించడం, భౌతిక దూరం పాటించడం వంటి కోవిడ్ నిబంధనలు పాటించాలని అయన అన్నారు.

 

- Advertisement -

పుంగనూరులో 8న ఘనంగా రాజన్న జయంతి వేడుకలునిర్వహించాలి- మంత్రి పిఏ మునితుకారాం

Tags:Rural SP inspecting ward women police examination center

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page