వికలాంగులకు వాహనాలు పంపిణీ

0 16

తుంగతుర్తి  ముచ్చట్లు:
తన పుట్టిన రోజు నాడు తాను మాత్రమే సంతోషంగా ఉంటే సరిపోదని,పది మంది సంతోషంగా ఉండాలని కోరుకునే నాయకుడు కేటీఆర్ అని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. శనివారం కేటీఆర్ పుట్టిన రోజు సందర్బంగా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజగవర్గం లోని అర్వపల్లి లో స్థానిక ఎమ్మెల్యే గాదరి కిషోర్ గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమం లో భాగంగా 20 మంది వికలాంగులకు అందించిన ఎలక్ట్రిక్ ట్రై సైకిళ్లను మంత్రి పంపిణీ చేశారు..ఇలాంటి కార్యక్రమానికి పిలుపునిచ్చినందుకు మంత్రి కేటీఆర్ కు ఈ సందర్బంగా ధన్యవాదాలు తెలిపారు.గత సంవత్సరం కేటీఆర్ పిలుపునందుకొని అనేక మంది ఏ విధంగా నైతే అంబులెన్సులను అందించారో,అలాగే ఈ సంవత్సరం కూడా అనేక మంది ట్రై సైకిళ్లను అందిస్తున్నారన్నారు.కార్యక్రమం సనంతరం రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ పిలుపు మేరకు నూతనకల్ మండలం బిక్కుమల్ల నుండి నకిరేకల్ వరకు జాతీయ రహదారి 365 పై 40 కిలోమీటర్ల పొడవు 60 వేల మొక్కలు నాటే కార్యక్రమానికి తుంగతుర్తి మండలం వెలుగుపల్లి వద్ద మొక్కను నాటి మంత్రి అంకురార్పణ చేశారు.

 

జిల్లా ఎంపీడీవోల సంఘ నాయకుడు లక్ష్మీపతినాయుడు మృతి

- Advertisement -

Tags:Distribution of vehicles for the disabled

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page