సమాజంలో భక్తిభావం పెంపోందించడానికే పారాయణం,ఆలయ చైర్మన్ స్వరూప

0 11

జగిత్యాల     ముచ్చట్లు:

సమాజంలో భక్తిభావం పెంపోందిoచ్చేందుకుగాను లలితమాత అమ్మవారు లోకాన్ని చల్లగా ఉంచాలని కోరుతూ లలితాసహస్ర నామపారాయణం చేయడం జరుగుతుందని 108 శ్రీచక్ర లలితమాత ఆలయ పౌండరీ ట్రస్ట్ చైర్మన్ చెల్లం స్వరూప సత్తయ్య అన్నారు.జగిత్యాల రూరల్ మండలం పొలాసలో శ్రీ లలితమాత సేవాట్రస్ట్ ఆధ్వర్యంలో   నిర్మాణం జరుగుతున్న 108 శ్రీచక్ర సహిత లలితమాత ఆలయ ప్రాంగణంలో 108 రోజులపాటు జరిగే లలితాసహస్ర నామాపారాయణంలోభాగంగా 15 వరోజు అమ్మవారిని వివిధ రకాల కూరగాయలతో అలంకరించగా శాకాంభారీగా భక్తులకు దర్శనమిచ్చారు. మహిళలు భజనలు చేయడంతో అప్రాంతమంతా ఆధ్యాత్మిక శోభను తరించుకుంది.ఈసందర్బంగా స్వరూప మాట్లాడుతూ 108 రోజులు అమ్మవారి పారాయణం చేయడం, దానికనుగుణంగా భక్తులు రావడం అమ్మవారి అనుగ్రహమేనని పేర్కొన్నారు.అమ్మవారి అనుగ్రహంతో   ఇప్పుడున్న భయానకపరిస్థితుల నుండి సమాజం బయటపడుతుందని దానికి ప్రతీ ఒక్కరు అమ్మవారిని పూజించాలని సూచించారు.కరోనా ప్రభావంతో ఆలయలు తెరువకపోవడంతో ఇళ్లల్లోనే వారి ఇస్తాదైవలను కొలిచిన భక్తులు, కొంత తగ్గుముఖం పట్టగానే అందరిని ఒకచోటుకుచేర్చి సామూహిక అమ్మవారి పారాయణo చేయాలన్నారు.ప్రతిఒక్కరు ఆరోగ్యాంగా ఉండాలని అందుకు దైవ ప్రార్థన చేయాలన్నారు. లలితా మాతా అమ్మ జపాన్ని చేసి అనుగ్రహం పొందాలని, అమ్మదయ ఉంటే అన్ని ఉన్నట్లేనని చెప్పారు.  చెల్లం స్వరూప ఆధ్వర్యంలో మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
పారాయణంలో పాల్గొన్న భక్తులకు ఆలయ సేవాట్రస్ట్ పక్షాన అమ్మవారి చిత్రపటాలు, గోరింటాకు సంబంధించిన కోన్లు,పండ్లు అందజేశారు.ఈ కార్యక్రమంలో  పాంపట్టి నాగేందర్ , సులోచన, సత్తయ్య, ప్రసన్న ,సరిత,కిషన్, బధ్రీనాథ్, రాములు, పద్మ, శంకరయ్య, లక్ష్మి నారాయణ, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

జిల్లా ఎంపీడీవోల సంఘ నాయకుడు లక్ష్మీపతినాయుడు మృతి

 

Tags:Recitation is to cultivate devotion in the community, Swaroop is the chairman of the temple

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page