అంగరంగ వైభవంగా లష్కర్ బోనాలు

0 9

హైదరాబాద్ ముచ్చట్లు :

 

తెలంగాణలోనే అత్యంత ఘనంగా నిర్వహించే లష్కర్ బోనాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. వేలాది మంది భక్తులు అమ్మవారిని బోనం సమర్పించేందుకు తరలి వచ్చారు. పోతరాజుల వీరంగాలు, శివసత్తుల శివాలతో ఉజ్జయినీ మహాకాళి పరిసర ప్రాంతాలు మారిమోగిపోయాయి. కాగా ఆషాడ బోనాల ఉత్సవాల సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదివారం తెల్లవారుజామున కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బంగారు బోనంతో తొలిబోనం, అమ్మవారికి వడిబియ్యం సమర్పించారు. ముందుగా మంత్రి శ్రీనివాస్ యాదవ్ కు ఆలయ ఈవో మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో పూర్ణకుంభంతో ఆలయ పండితులు వేదమంత్రాలతో స్వాగతం పలికారు. అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మంత్రి శ్రీనివాస్ యాదవ్ దంపతులను వేదపండితులు ఆశీర్వదించారు.

- Advertisement -

జిల్లా ఎంపీడీవోల సంఘ నాయకుడు లక్ష్మీపతినాయుడు మృతి

Tags; Lashkar-e-Bona as the glory of Angaranga

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page