ఆనందయ్య పేరిట నకిలీ మందు

0 5

ఒంగోలు ముచ్చట్లు :

 

ఆనందయ్య మందు పేరిట నకిలీ మందు విక్రయిస్తున్న నకిలీ ముఠా గుట్టును ఫోకస్‌ హ్యూమన్‌ రైట్స్‌ కౌన్సిల్‌ రట్టు చేసి పోలీసులకు పట్టించింది. నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన ఆర్‌.సురేశ్‌ కొంతకాలంగా ఆనందయ్య మందు పేరుతో నకిలీ మందు తయారుచేసి అందిస్తున్నాడు. ఫోకస్‌ హ్యూమన్‌ రైట్స్‌ కౌన్సిల్‌ ప్రతినిధి కె.ఆనంద్‌.. సురేశ్‌ను సంప్రదించి తనకు మందు కావాలని కోరారు. అందుకు సురేశ్‌ డబ్బులు డిమాండ్‌ చేశాడు. ఉచితంగా ఇస్తున్న మందుకు సురేశ్‌ డబ్బు వసూలు చేయడంపై అనుమానించిన ఆనంద్‌ హ్యూమన్ రైట్స్ సహకారాన్ని కోరారు. సురేశ్‌ 12 కేజీల మందును రూ.1.20 లక్షలకు ధర నిర్ణయించాడు. అయితే హైదరాబాద్‌కు చేర్చాలని ఆనంద్‌ కోరగా, నెల్లూరులోనే ఇవ్వగలం..లేకుంటే ఒంగోలు వరకు వచ్చి అందిస్తామని సురేశ్‌ తెలిపారు. దీంతో హ్యూమన్‌ రైట్స్‌ ప్రతినిధులు హైదరాబాద్‌ నుంచి శనివారం ఉదయం ఒంగోలుకు చేరుకున్నారు. మందు విక్రయిస్తున్న సురేశ్‌తోపాటు 12కేజీల నకిలీ మందును స్వాధీనం చేసుకున్నారు.

 

- Advertisement -

జిల్లా ఎంపీడీవోల సంఘ నాయకుడు లక్ష్మీపతినాయుడు మృతి

Tags: Counterfeit drug in the name of Anandayya

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page