గంగమ్మ తల్లి దీవెనలకోసం …..తరలివచ్చిన జనం

0 14

– ఆషాడమాసం రాకతో పెరిగిన రద్దీ
– కిటకిటలాడిన బోయకొండ
– ప్రత్యేక అలంకారంలో అమ్మవారు

 

చౌడేపల్లె ముచ్చట్లు:

- Advertisement -

బోయకొండ గంగమ్మతల్లి దీవెనలకోసం భక్తులు బోయకొండ కు ఆదివారం అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆషాడమాసం కావడంతోపాటు శెలవు దినం కావడంతో గంగమ్మ ఆలయంలో భక్తుల రద్దీ గణనీయంగా పెరగడంతో క్యూలైన్లు అన్నీ క్రిక్కిరిసిపోయాయి. బోయకొండలో ఎటుచూసినా జన సంధ్రంగామారింది.ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలనుంచి వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం వివిధవాహనాల్లో తరలివచ్చారు. అర్చకులు అమ్మవారిని ప్రత్యేక పూలతో అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు.అమ్మవారి దర్శనం కోసం క్యూలైన్లులో భక్తులు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది.కోరిన కోర్కెలు తీరిన భక్తులు ౖపిండి,నూనెదీపాలు, దీవెలతో మేళతాళాల నడుమ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి వెహోక్కులు చెల్లించారు. ఆలయ చైర్మన్‌ మిద్దింటి శంకర్‌నారాయణ, ఈఓ చంద్రమౌళిల ఆధ్వర్యంలో అమ్మవారి తీర్థప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు.సీఐ మధుసూదనరెడ్డి ్య ధ్వర్యంలో ఎస్‌ఐ రవికుమార్‌ ఎలాంటి సంఘటనలు తలెత్తకుండా నిఘా ఏర్పాటుచేశారు.

జిల్లా ఎంపీడీవోల సంఘ నాయకుడు లక్ష్మీపతినాయుడు మృతి

Tags: For the blessings of Gangamma’s mother ….. the people who had gathered

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page