డీ.సీ.ఎం.ఎస్ చైర్ పర్సన్ నాగ లక్ష్మి కు ఘన సన్మానం

0 24

 

తిరుపతి ముచ్చట్లు:

 

- Advertisement -

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నామినేటెడ్ పదవుల లో డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ చైర్ పర్సన్ గా నియమితు లైన సామకోటి నాగలక్ష్మి ని విశ్వం విద్యా సంస్థల అధినేత డా||యన్.విశ్వనాథ రెడ్డి, గీతం విద్యా సంస్థల అధినేత టి. వేంకటేశ్వరులు, ప్రజానేస్తం అద్యక్షులు మరియు వై యస్ ఆర్ సి పి రాష్ట్ర నాయకులు యన్.రాజా రెడ్డి, విశ్వం విద్యా సంస్థల అకాడమిక్ డైరెక్టర్ యన్. విశ్వ చందన్ రెడ్డి, లిటిల్ స్టార్ స్కూల్ అధినేత బి.రాజేష్ తదితరులు ఆదివారం నాడు సామకోటి నాగలక్ష్మి మరియు భర్త సామకోటి సహదేవరెడ్డిలను తిరుపతి లోని తమ స్వగృహంలో మర్యాద పూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమం లో విశ్వం విద్యా సంస్థల అధినేత డా||యన్. విశ్వనాథ్ రెడ్డి మాట్లాడుతూ నాగలక్ష్మి చిన్న తనం నుంచి గ్రామీణ ప్రాంతాల పేద ప్రజల సమస్యలని పరిష్కరించి వారి అభివృద్ధికీ తోడ్పడుతు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని తెలియ చేశారు మరియు డీ సీ యం యస్ సంస్థ అభివృది కి మరింతగా కృషి చేయలని కోరారు.

 

జిల్లా ఎంపీడీవోల సంఘ నాయకుడు లక్ష్మీపతినాయుడు మృతి

Tags:Solid tribute to DCMS Chairperson Naga Lakshmi

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page