దర్శనం టికెట్లతో వ్యాపారం చేసే వారిపై కఠిన చర్యలు

0 10

– రేవతి పద్మావతి ట్రావెల్స్ పై కేసు

 

తిరుమల ముచ్చట్లు:

 

- Advertisement -

తిరుమల శ్రీవారి దర్శనం కోసం రూ 300 టికెట్లతో పాటు కళ్యాణోత్సవం లాంటి కొన్ని ఆర్జిత సేవా టికెట్లు రాబోయే నెల కోటా ప్రతి నెల 20వ తేదీ ఆన్లైన్ లో విడుదల చేయడం జరుగుతుంది.కొంతమంది దళారులు, ట్రావెల్స్ సంస్థలు తాము దర్శనం టికెట్లు బుక్ చేయిస్తామని భక్తుల నుంచి ఎక్కువ మొత్తం వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు వచ్చాయి. చెన్నై కి చెందిన రేవతి ట్రావెల్స్ సంస్థ భక్తులనుంచి ఎక్కువ డబ్బులు వసూలు చేస్తూ ఆన్లైన్లో దర్శనం టికెట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిసింది. దీంతో సదరు సంస్థపై టీటీడీ విజిలెన్స్ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేసి కేసు నమోదు చేయించారు.. భక్తులు www tirupatibalaji.ap.gov.in వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ లో తమ ఆధార్ కార్డ్ నంబర్, చిరునామా తో టికెట్లు బుక్ చేసుకునే సదుపాయం టీటీడీ కల్పించింది. భక్తులు దళారులను ఆశ్రయించి నష్ట పోవద్దని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. స్వామివారి దర్శనం టికెట్లు, సేవా టికెట్లతో వ్యాపారం చేసే దళారులు, ట్రావెల్స్ సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరిస్తోంది.

జిల్లా ఎంపీడీవోల సంఘ నాయకుడు లక్ష్మీపతినాయుడు మృతి

Tags: Strict measures against those who trade with darshan tickets

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page