మంత్రి పెద్దిరెడ్డి బోయకొండ పర్యటనకు సిద్దం చేయండి

0 43

-వైఎస్సార్య్సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి
– అభివృద్దిపనులను పరిశీలించనున్న మంత్రి
– ఒక రోజంతా బోయకొండలో ఉండేలా ప్లాన్‌
– అభివృధ్దిపనులు వేగవంతం చేయాలి

 

 

చౌడేపల్లె ముచ్చట్లు:

- Advertisement -

మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బోయకొండలో కోట్లాది రూపాయల వ్యయంతో జరుగుతున్న పలు అభివృద్ది పనులను త్వరలో పరిశీలించనున్నట్లు వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన ఆలయ కమిటీ చైర్మన్‌ మిద్దింటి శంకర్‌నారాయణ, ఈఓ చంద్రమౌళితో కలిసి బోయకొండలో జరుగుతున్న అభివ్యృధ్దిపనులను పరిశీలించారు.అనంతరం మీడియాతో మాట్లాడారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుంచి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పలు అభివృద్దిపనులను మంజూరు చేశారని, ఆపనులు ముగింపు దశకు చేరులొ ఉన్నట్లు తెలిపారు. అలాగే భక్తులకు అవసరమైన మౌళిక వసతులు, రవాణా,తదితర సౌకర్యాలతోపాటు, పుష్కరిణి ఆధునీకరణ చేయడం పనులు చురుగ్గా జరుగుతున్నట్లు పేర్కొన్నారు. ఈ పనులను పరిశీలించి ఇంకనూ బోయకొండలో చేపట్టాల్సిన పనులపై అధికారులు, పాలకవర్గంతో కలిసి ఒక రోజంతా బోయకొండ గంగాపురం, బోయకొండ ఆలయం వద్ద మంత్రి పర్యటిస్తూ పలు ప్రదేశాలను సందర్శించనున్నారు. అవసరమైన పనులను గుర్తించి మరో ప్లాన్‌ సిద్దం చేయనున్నట్లు చెప్పారు. బోయకొండ ఆలయం వద్ద ఉపాధి హామీ నిధులతో అత్యంత సుంధరంగా ఆహ్లాదరకమైన వాతావరణంను తలపించేలా పార్క్ ఏర్పాటు, అవెన్యూ ప్లాంటేషన్‌ పనులు చేపడుతున్నారని, వీటికి సంబందించి పలు సలహాలు, సూచనలు మంత్రి ఇవ్వనున్నట్లు చెప్పారు.మంత్రి పర్యటనను పురస్కరించుకొని జరుగుతున్న అభివృద్దిపనులు వారం లోపు పూర్తిచేయాలని ఆవెంటనే మంత్రి పర్యటన ను ఖరారు చేయనున్నట్లు పెద్దిరెడ్డి తెలిపారు. అనంతరం అమ్మవారిని దర్శించుకొని, భక్తులతో అమ్మవారి దర్శన సదుపాయాలు, వసతులపై అడిగి తెలుసుకొన్నారు. వారి వెంట సోమల మల్లికార్జునరెడ్డి, గణేష్‌,గిరిబాబు, న్రవీన్‌రెడ్డి,సుర్యేద్ర,మణితదితరులున్నారు.

 

జిల్లా ఎంపీడీవోల సంఘ నాయకుడు లక్ష్మీపతినాయుడు మృతి

Tags: Get ready for Minister Peddireddy Boyakonda’s visit

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page