రోడ్డు ప్రమాదంలో బిగ్‌బాస్‌ ఫేమ్ యాషికా ఆనంద్‌కి తీవ్ర గాయాలు

0 6

చెన్నై ముచ్చట్లు :

బిగ్‌బాస్‌ ఫేమ్ యాషికా ఆనంద్‌కి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదం తమిళనాడులో చోటు చేసుకుంది. యాషికా తన స్నేహితురాలు, హైదరాబాద్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ వల్లిశెట్టి భవాని, మరొకరు కారులో ప్రయాణిస్తుండగా.. చెంగల్‌పట్టు జిల్లా మామల్లపురంలో డివైడర్‌ను కారు ఢీకొట్టడంతో యాషికా ఆనంద్‌ సహా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో వల్లిశెట్టి భవాని మృతి చెందారు. మద్యం మత్తులో కారు వేగంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. తీవ్రంగా గాయపడిన యాషికా ఆనంద్‌తో పాటు మరో ఇద్దరిని చికిత్స కోసం చెన్నైలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం యాషిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

 

- Advertisement -

జిల్లా ఎంపీడీవోల సంఘ నాయకుడు లక్ష్మీపతినాయుడు మృతి

Tags:Big Boss Fame Yashika Anand seriously injured in road accident

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page