రోష్ని చట్టం రద్దుకు VHP హర్షం

0 5

జమ్మూ కాశ్మీర్ ముచ్చట్లు :

భారత ప్రభుత్వం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి చెందిన రోష్ని చట్టాన్ని రద్దు చేసింది.ఇప్పటివరకూ ఇటువంటి చట్టం ఒకటి ఉన్నదనే విషయాన్ని మన దేశంలోని ఏ ప్రచార సాధనాలు (ప్రింట్, మీడియా) ప్రజలకు తెలియజేయలేదు.ఫరూక్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ రోష్ని చట్టాన్ని కాశ్మీరులో ముస్లింల ప్రయోజనం కోసంఅమలుచేశాడు. ఈ చట్టం ప్రకారం జమ్మూ కాశ్మీర్ రాష్ట్రములోని వేలాది హిందువుల భూములు, ఇళ్లు, వ్యవసాయక్షేత్రాలు, దుకాణాలు కాశ్మీరులోని ముస్లిములకు పంచిపెట్టాడు. ఈ పాపంలో కాంగ్రెస్ పార్టీకి కూడా భాగం ఉంది.1990 లో కాశ్మీర్ విడిచి ప్రాణ భయంతో పారిపోయిన వేలాదిమంది హిందువులను పాకిస్తాన్ ముస్లిములు చంపలేదు. బాల్యంనుండి కలిసిమెలిసి ఉంటూ సేమ్యాలు తింటూ, ఏ ముస్లింలతో పండుగలు జరుపుకున్నారో ఆకాశ్మీర్ ముస్లిములైన అబ్దుల్, అస్లామ్, గఫార్ తెగలకు చెందినవారే నిర్దాక్షిణ్యంగా అమాయకులైన వేలాదిమంది హిందువులను చంపేశారు.చనిపోగా మిగిలిన వేలాదిమంది హిందువులు ప్రాణభయంతో కాశ్మీరు లోయను విడిచి తమ నివాసాలను ఖాళీచేసి వెళ్ళిపోయారు. అప్పుడు కొంతమంది ముస్లిం పెద్దలు ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లాను కలిసి హిందువులకు చెందిన భూములు, ఇళ్లు, వ్యవసాయక్షేత్రాలు, దుకాణాలు వగైరా ఆస్తులన్నీ ముస్లిములకు పంచి ఇచ్చేలా ఒక చట్టాన్ని చేయమని ఆయనను కోరడం జరిగింది.

- Advertisement -

వారి కోరికమేరకు ఫరూక్ అబ్దుల్లా ఈ రోష్ని చట్టాన్ని అమలు చేసారు. ఈ చట్టం ప్రకారం కేవలం రూ. 101/- లు చెల్లిస్తే హిందువులకు చెందిన భూములు, ఇళ్ళు, వ్యవసాయ క్షేత్రాలు, దుకాణాలు మొదలైనవి కాశ్మీరులోని ముస్లిములకు యాజమాన్య హక్కులు కల్పించబడ్డాయి.కాశ్మీరులోని ముస్లిములు వారి నివాసాలకు ఇరుగు పొరుగున ఉన్న హిందువుల నివాసాలకు విద్యుత్ నిలిపివేశారు. తద్వారా ఆప్రాంతాలన్నీ చీకటిమయం అయిపోయాయి. హిందువుల నివాసాలు ముస్లిములు ఆక్రమించుకోవడం వల్ల వారంతా చీకటిలో ఉండిపోవడం జరిగింది. ప్రభుత్వం అక్కడ విద్యుత్ పునరుద్ధరణ చేయలేదు.రోష్ని అనగా వెలుగు, కాంతి, విద్యుత్ అని అర్ధం ఉంది. ప్రజల జీవితాలలో వెలుగులు నింపవలసిన ఈ రోష్ని చట్టం హిందువుల జీవితాలను చీకటిలోకి నెట్టివేసింది. ఈవిధంగా హిందువుల ఆస్తులన్నీ కాశ్మీరు ముస్లిములకు ధారాదత్తం చేయడానికి ఈ రోష్ని చట్టం చేయబడింది.ప్రాణభయంతో పారిపోయిన వేలాదిమంది హిందువుల ఆస్తులను కేవలం రూ.101/- లు చెల్లించిన కాశ్మీరీ ముస్లిములకు యాజమాన్య హక్కులను ఈ రోష్ని చట్టం కలుగజేస్తోంది.ఈవిధంగా ఈవిద్యుత్ బిల్లు ( రోష్ని చట్టం) ప్రవేశపెట్టి కాశ్మీర్ ముస్లిములకు అనేక సంవత్సరాల తరబడి యాజమాన్య హక్కులు కట్టబెట్టి, హిందువుల ఆస్తులను యధేచ్చగా అనుభవించే హక్కులు కలగజేసింది.కాశ్మీర్ ముఖ్యమంత్రి ఫరూక్ అబ్దుల్లా హిందువులకు చెందిన విలువైన ఆస్తులపై ఈరోష్నీ చట్టం ద్వారా కాశ్మీరీ ముస్లిములకు హక్కులు ఇచ్చాడు. ఇది పూర్తిగా ముస్లిములకు అనుకూలంగా, హిందువులకు వ్యతిరేకంగా చేసిన చట్టం.ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే వామపక్ష ప్రభావిత, ఇతర ప్రచార (ప్రింట్), ప్రసార(మీడియా) సాధనాలు ఎప్పుడూ దీనిగురించి చర్చించలేదు. ఇది కాశ్మీరులోని హిందువులపై జరిగే ఈ రోష్నిచట్టం ఒక ఉదాహరణ.కాశ్మీరీ హిందువుల పాలిట చీకటి చట్టంగా ఉన్న ఈ రోష్ని చట్టాన్ని కేంద్రం రద్దు జేయడం ఆనందదాయకంగా భావిస్తున్నది. ఈ రోష్ని చట్టాన్ని రద్దు చేసినందుకు విశ్వహిందూ పరిషత్ కేంద్రానికి ధన్యవాదాలు తెలుపుతున్నది.

 

జిల్లా ఎంపీడీవోల సంఘ నాయకుడు లక్ష్మీపతినాయుడు మృతి

Tags:VHP is happy to repeal the Roshni Act

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page