అమెరికాలో కార్చిచ్చు

0 22

అమెరికా ముచ్చట్లు :

 

అమెరికాలో కార్చిచ్చు కలకలం కొనసాగుతోంది. ఉత్తర కాలిఫోర్నియాలో దావానలం మరింత చెలరేగడంతో పలు ఇళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. ఈ నెల 14న ఇక్కడి కార్చిచ్చు మొదలైన సంగతి తెలిసిందే. తాజాగా ఇండియన్‌ ఫాల్స్‌ పట్టణంలో పదుల కొద్దీ ఇళ్లకు నిప్పు అంటుకుంది. ఈ రాష్ట్రంలో ఇప్పటికే 1.8 లక్షల ఎకరాలు అగ్నికీలలకు ఆహుతయ్యాయి. ఇక్కడి నాలుగు ఉత్తర కౌంటీలకు కాలిఫోర్నియా గవర్నర్‌ గవిన్‌ న్యూసమ్‌ అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. మరోవైపు దక్షిణ ఒరిగాన్‌లో దావానలాన్ని అగ్నిమాపక దళం 2200మంది కలిసి అదుపులోకి తీసుకొచ్చేందుకు చెమటోడుస్తున్నారు. మొత్తంగా అమెరికావ్యాప్తంగా 85 చోట్ల దావానలం వ్యాపిస్తోంది. వాటిలో అత్యధికంగా పశ్చిమ రాష్ట్రాలే ఉన్నాయి. 14లక్షల ఎకరాల భూమిని అగ్ని దహించినట్లు అంచనా.

 

- Advertisement -

ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత

Tags: Burn in America

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page