అసైన్డ్ భూములు పేదలకు పంచాలి సిపిఐ

0 11

తుర్కపల్లి  ముచ్చట్లు:
తుర్కపల్లి మండలం ఇబ్రహీంపూర్ గ్రామంలో సిపిఐ గ్రామ శాఖ సమావేశం నాగారం అంజయ్య అధ్యక్షతన సోమవారం జరిగింది. ఈ సందర్బంగా  సిపిఐ జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు పార్టీ జెండాను ఆవిష్కరించారు.  అనంతరం ఆయన మాట్లాడుతూ గ్రామంలో 120 సర్వే నెంబర్ లో ఉన్న సుమారు 50 ఎకరాల అసైన్డ్ భూమి, భూములు లేని నిరుపేదలకు పంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన కుటుంబీకులు గత కొన్నేళ్లుగా సాగుబడి చేసుకుంటున్నా పది ఎకరాల భూమిని అటవీశాఖ అధికారులు దౌర్జన్యంగా స్వాధీనం చేసుకున్నారని మండిపడ్డారు. వారు స్వాధీనం చేసుకున్న భూమిని హరిజన, గిరిజనులపై కేసులు పెడతామని బెదిరించారని అన్నారు. ఈ సమస్యపై సంబంధిత రెవెన్యూ అధికారులు, గత కలెక్టర్ అనితా రామచంద్రన్, డి ఆర్ ఓ లు స్వయంగా వచ్చి భూ సమస్యలు పరిష్కరించి భూమి లేని నిరుపేదలకు,గత కొన్నేళ్లుగా సాగుబడి చేసుకుంటున్న దళితులకు ఇస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఇటీవల ఫారెస్ట్ స్థలం చుట్టూ ఏర్పాటు చేసినట్లు పెన్సింగ్ గేటును ప్రారంభించి మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి జగదీశ్ రెడ్డిలకు ఈ సమస్యను వారి దృష్టికి తీసుకెళ్లినా వారు కూడా ఈ సమస్యను పరిష్కరించి,న్యాయం జరిగేలా చూడాలని అధికారులను ఆదేశించారని తెలిపారు, అయినా కూడా ఇంత వరకు ఎలాంటి స్పందన లేదని నిరుపేద కుటుంబాలకు చెందిన వారు అయోమయానికి గురవుతున్నారు అని అధికారులు మంత్రులు ఇచ్చిన హామీలు అమలుకు నోచుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు, పేదలకు చెందాల్సిన భూములు వారికి అందించాలని లేనిపక్షంలో భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి సిలువేరు దుర్గయ్య, మండల నాయకులు ఈదులకంటి రమేష్,బబ్బూరి భాను, కార్యకర్తలు, హమాలీ సంఘం సభ్యులు, నాగారం కిష్టయ్య, బత్తుల కుమార్, గుజుక మైపాల్,బండారి రాజు, కొరిమి కనకరాజు,బత్తుల హరినాథ్, లక్ష్మీ నరసయ్య, మోత్కుపల్లి నర్సింలు, బొడెలి, బాలకృష్ణ, నాగారం నరసయ్య, బండారి అజయ్,నర్లేంగల శ్రీను, అన్నంపట్ల సుధాకర్, తదితరులు పాల్గొన్నారు.

 

ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత

 

- Advertisement -

Tags:Assigned lands should be distributed to the poor
CPI

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page