ఎంత పెద్ద ఆపద వచ్చినా మీ వెంటే ఉండి కాపాడుతా: స్వర్ణలత భవిష్యవాణి

0 13

హైదరాబాద్‌ ముచ్చట్లు:

ఎంత పెద్ద ఆపద వచ్చినా మీ వెంటే ఉండి కాపాడుతానన్నారు మాతంగి స్వర్ణలత భవిష్యవాణి.సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆలయంలో రంగం సందర్భంగా మాతంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. మహమ్మారితో ఎన్ని కష్టాలు వచ్చినా సంకోచించకుండా ఉత్సవాలను వైభవంగా నిర్వహించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. భక్తులు సంతోషంగా ఉండే విధంగా చూసుకొనే బాధ్యత తనదేనని, కరోనా మహమ్మారి ప్రజలను చాలా ఇబ్బందులు పెట్టిందని, వర్షాలతో రైతులు కొంత ఇబ్బందులు పడతారన్నారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా భక్తులు తనను నమ్మి పూజలు చేశారని, వారిని కాపాడే బాధ్యత తనదేనని స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. కార్యక్రమానికి మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ హాజరయ్యారు. సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఆదివారం వైభవంగా జరిగిన విషయం తెలిసిందే. వేలాది మంది భక్తులు అమ్మవారికి బోనాలు, సాక సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు..

- Advertisement -

ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత

 

Tags:Stay with you and protect yourself no matter how big the danger: Swarnalatha is a prophecy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page