ఎస్.ఐ మమత ను  మర్యాదపూర్వకంగా కలిసిన సిపిఐ నాయకులు

0 25

మద్దికేర  ముచ్చట్లు:
మద్దికెర మండల నూతన ఎస్.ఐ గా బాధ్యతలు చేపట్టిన మమత ను సిపిఐ నాయకులు మర్యాద పూర్వకంగా కలిశారు.ఆదివారం రోజున స్థానిక మద్దికేర పోలీస్ స్టేషన్ నందు సిపిఐ నాయకులు కలిసి మహిళ ఎస్సై మమత కు శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా సిపిఐ నాయకులు మాట్లాడుతూ సమాజంలో జరిగే అసాంఘిక కార్యకలాపాలపై దృష్టి సాధించాలని ఎస్సై కు తెలియజేశారు.ఈ సందర్భంగా ఎస్సై మమత మాట్లాడుతూ సారా,మట్కా,పేకాట మరియు బెట్టింగ్ లను నిర్వహించే వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని ఆమె తెలియజేశారు.మహిళలందరూ తమ సెల్ ఫోన్ నందు దిశ యాప్ ను ఇన్స్టాల్ కోవాలని తెలియజేశారు.శాంతి భద్రతలకు విఘాతం కలిగించకుండా ప్రతి ఒక్కరూ అధికారులకు సహకరించాలని ఆమె తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సిపిఐ మండల కార్యదర్శి నెట్టికంటయ్య,మాజీ మండల కార్యదర్శి వలి సాహెబ్,మండల రైతు సంఘం నాయకులు బసన్న,సీపీఐ నాయకులు మనోహర్,సాధిక్ తదితరులు పాల్గొన్నారు.

ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత

 

- Advertisement -

Tags:CPI leaders who met SI Mamata politely

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page