ఏపి రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్‌

0 10

అమరావతి ముచ్చట్లు:
రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వైరస్‌ వ్యాక్సినేషన్ ప్రత్యేక డ్రైవ్‌లో భాగంగా సోమవారం 2,128 కోవిడ్‌ టీకా కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ అందిస్తున్నారు. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల కోవిడ్‌ వ్యాక్సిన్‌లు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా 45 ఏళ్లు పైబడినవారు, ఐదేళ్లలోపు చిన్నారుల తల్లులు, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు రెండో విడత వ్యాక్సినేషన్‌ కార్యక్రమం కొనసాగుతోంది. అదే విధంగా కృష్ణా జిల్లా వ్యాప్తంగా సోమవారం కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ మెగా డ్రైవ్‌ కొనసాగుతోంది. మొదటి డోస్‌ వ్యాక్సిన్‌ తీసుకోని గర్భిణులు, బాలింతలు, ఉపాధ్యాయులు, నర్సింగ్, శానిటేషన్‌ సిబ్బంది ఇతర హెల్త్‌ కేర్‌ వర్కర్‌్తకు వ్యాక్సిన్‌ అందిస్తున్నారు. మొదటి విడత డోస్‌ తర్వాత నిర్ణీత కాల వ్యవధి పూర్తి చేసుకున్న వారికి రెండో డోస్‌  కోవిడ్‌ టీకా వేస్తామని వైద్యులు తెలిపారు.

 

పలమనేరులో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సుడిగాలి పర్యటన

- Advertisement -

Tags:Corona virus vaccination special drive across AP state

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page