కరోనా వ్యాక్సినేషన్

0 6

కోటికేశవరం పీ.హెచ్.సీ లో వేగవంతం
కాకినాడ  ముచ్చట్లు:
తూర్పుగోదావరి జిల్లా కోరుకొండ మండలం కోటికేశవరం పి.హెచ్.సి రాఘవాపురం, బొల్లెద్దుపాలెం, కోటికేశవరం, కోటి, శ్రీరంగపట్నం గ్రామాల ప్రాథమిక ఉపకేంద్రాలలో కరోనా నియంత్రణకు వ్యాక్సినేషన్ ప్రక్రియ కొనసాగుతుందని డాక్టర్ పి.పుణ్యశాంతి తెలియజేశారు. మెదటి డోస్ వేసుకుని రెండవ డోస్ కు ఇచ్చిన గడువు సమీపించిన వారికి కూడా రెండవ డోస్ వేస్తున్నామని అన్నారు. . ఆయా గ్రామాల్లో వాలంటీర్లు,ఆశాలు,ఏం.ఎన్.ఏం ల  ద్వారా ఇంకా ఎంతమంది మిగిలి ఉన్నారు ఎవరెవరు వ్యాక్సినేషన్ వేయించుకోవాలి అనే దానిపై పూర్తి స్థాయిలో సర్వే చేస్తున్నామన్నారు. ప్రజలు ఇబ్బందులు పడకుండా వారి సమీప సబ్ సెంటర్లోనే కరోనా వ్యాక్సిన్ ను  అందుబాటులో ఉంచుతున్నామన్నారు. 45 ఏళ్లు పైబడిన వారందరికీ టీకాలు వేస్తున్నామని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రెండు టీకాలు వేయించుకోవాలని మొదటి టీకా వేయించుకుని రెండవది పూర్తి కాకపోతే ఫలితం ఉండదన్నారు. వైరస్ మహమ్మారిని ఎదుర్కోవాలంటే టీకా ఒక్కటే మార్గం అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎం.పీ.హెచ్.ఈ.వో సూపర్వైజర్ ప్రసాద్,పి. హెచ్.ఎన్ శకుంతలా కుమారి,పలువురు ఏఎన్ఎంలు,ఆశాలు,హెల్త్ అసిస్టెంట్లు, వాలంటీర్లు పాల్గొన్నారు.

ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత

 

- Advertisement -

Tags:Corona vaccination

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page