కుప్పంలో నకిలీ పోలీసులు హల్చల్

0 18

కుప్పం  ముచ్చట్లు:
నకిలీ పోలీసులు సరిహద్దుల్లో కాపుకాస్తున్నారు. పోలీసులమంటూ బెదిరిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. ఏకంగా పెద్ద వాహనాలను సైతం వదలని వైనం కుప్పంలో చోటుచేసుకుంది..బోయకొండ నుంచి తమిళనాడు కు వెళ్తున్న భక్తులను అడ్డుకొని ఇన్నోవా కారును తీసుకొని పరారైయారు. కుప్పం మండలంలో ఈమధ్య కర్ణాటక ప్రాంతం కేజీఎఫ్  నుండి వచ్చిన దుండగులు పోలీసులమంటూ బెదిరిస్తున్న ముఠా,  ఈరోజు ఏకంగా కారును అడ్డుకుని ఇన్నోవా కారును అపహరించుకొనిపోయారు.వివరల్లోకెళితే తమిళనాడు నుండి బోయకొండ గంగమాంబ దర్శనం చేసుకొని తిరుగు ప్రయాణ సమయంలో కుప్పం మండలం బంగారునత్తం గ్రామ సమీపంలోకి చేరుకోగానే పోలీసుల తనిఖీలంటూ ఐదు మంది సభ్యులు వాహనానికి అడ్డుకున్నారు.  లోపల కారుని చెకప్ చేయాలని చెప్పడంతో కారులో ఉన్నవారు కిందకు దిగగానే నకిలీ పోలీసులు ముగ్గురు కారుతో ఉడాయించారు. మిగిలిన ఇద్దర్ని పట్టుకున్న బాధితులు దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. తరచు ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటుండటంతో నిఘా పెంచి నకిలీ వ్యక్తుల కదలికలను పరిశీలించి తగుచర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

 

ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత

- Advertisement -

Tags:Fake cops hustle in the heap

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page