కొంత్రాయిగుడ లో  మంచినీటి సమస్య తీర్చాలని గిరిజన సంఘం  డిమాండ్  

0 8

విశాఖపట్నం   ముచ్చట్లు:
బస్కీ పంచాయతీ కొంతర్రాయిగూడ గ్రామంలో గిరిజన సంఘం ఆధ్వర్యంలో మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి గిరిజన సంఘం పంచాయితీ నాయకులైన సమర్ది బాబురావు మాట్లాడుతూ గత 3 నెలల క్రితం వేసిన బోరు పూర్తి చేసి కొంత్రాయిగుడ లో మంచినీటి సరఫరా చేయడంలో పంచాయతీ అధికారులు ప్రజా ప్రతినిధులు నిర్లక్ష్యం కారణంగా మా ఊరులో మంచినీరు సమస్య తీవ్రంగా పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు అనేక సందర్భంలో సంబంధిత అధికారులకు సర్పంచి గారికి వినవించినప్పటికీ ఎటువంటి పరిష్కారం దొరకలేదు నీటి ఎద్దడి సమస్య తీవ్రంగా వెంటాడుతున్న అధికారులు స్పందించకపోవడం దారుణం, కలుషిత నీరు త్రాగుతూ  నిత్యం అనారోగ్యం పాలవుతున్నారు ఇప్పటికైనా కొంత్రాయిగుడ గ్రామంలో మంచి నీటి సమస్య పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు లేనియెడల పంచాయతీ కార్యాలయం ముట్టడి చేస్తామని ఈ సందర్భంగా  తెలిపారు ఈ కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు కె.కన్నయ్య కె.సుబ్బారావు కె.సోములు  జి.రామన్న  కె.జయంతి కె.లక్ష్మి ఎస్.కలిమా ఎస్.కుమారి ఎస్.సంధ్య రమేష్ కిండంగి రామారావు తదితరులు పాల్గొన్నారు.

 

జిల్లా ఎంపీడీవోల సంఘ నాయకుడు లక్ష్మీపతినాయుడు మృతి

- Advertisement -

Tags:Tribal community demands to solve fresh water problem in Kontraiguda

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page