కోటి 10 లక్షల దాటేసిన డోసులు

0 10

హైదరాబాద్ ముచ్చట్లు:
వ్యాక్సిన్‌ వేసుకునేందుకు వెనుకడుగు వేయవద్దు. టీకా తీసుకోవటం ద్వారా కోవిడ్‌-19 నుంచి కాపాడుకోవచ్చు. వ్యాక్సిన్‌ వేసుకున్నాక కూడా కరోనా సోకదని చెప్పలేం. అయితే కచ్చితంగా వ్యాక్సినేషన్‌ తర్వాత వచ్చే కరోనా తీవ్రత తక్కువగా ఉంటుంది. ఆస్పత్రి పాలయ్యే అవకాశాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.’ ఇవీ వ్యాక్సినేషన్‌ పై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పాలకులు, ఆరోగ్య అధికారులు పదే పదే వల్లె వేస్తున్న మాటలు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం ఇందుకు పూర్తి భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. ‘మాకు వ్యాక్సిన్‌ ఇవ్వండి. మమ్మల్ని కరోనా బారి నుంచి కాపాడండి. కనీసం వ్యాక్సిన్‌ ఎప్పుడు, ఎక్కడ ఇస్తారో చెప్పాలంటూ ‘ ప్రజలు కోరుతున్నారు. అయినా వారి మొరను ప్రభుత్వం ఆలకించటం లేదు. వ్యాక్సిన్‌ డోసుల సరఫరాపై కేంద్రం మొదట్నుంచి గోప్యతను పాటిస్తూ వస్తున్నది. రాష్ట్ర కేటాయింపులకు తగ్గట్టుగా సకాలంలో డోసులను పంపించకుండా జాప్యం చేస్తున్నది. ఇక రాష్ట్ర ప్రభుత్వం గత జనవరి నుంచి ఎదురవుతున్న అనుభవాల నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడటంలో విఫలమైంది. సమాచారం అందించటం లేదు. ఈ క్రమంలో వ్యాక్సిన్‌ ఇస్తున్నారనే సమాచారంతో ప్రతి రోజు కేంద్రాల వద్దకు వచ్చే వందలాది మంది వెనక్కి వెళ్లిపోతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కోవిషీల్డ్‌, కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ డోసులు ఇస్తున్నారు. దీంట్లో కోవాగ్జిన్‌ కొరత ఎక్కువగా ఉండటంతో అతి తక్కువ కేంద్రాల్లో మాత్రమే అది అందుబాటులో ఉంటున్నది.

 

దీంతో ఇప్పటికే మొదటి డోసు వేసుకున్న వారు రెండో డోసు సమయానికి కూడా వ్యాక్సిన్‌ దొరకకపోవటంతో ఆందోళనతో ప్రయివేటు ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు.రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రోజూ వ్యాక్సిన్‌ కు సంబంధించి ప్రత్యేక మీడియా రిపోర్ట్‌ ను విడుదల చేస్తున్నది. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరిధిలో 100 కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ సెంటర్లలో కోవిన్‌ పోర్టల్‌ లో ముందుగా నమోదు చేసుకున్న వారికి ఇస్తున్నారు. అదే విధంగా పట్టణ స్థానిక సంస్థల పరిధిలో ఉన్న 204 ప్రభుత్వ కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ సెంటర్లలో కూడా ఆన్‌ లైన్‌ లో నమోదు చేసుకున్న వారికే వేస్తున్నారు. ఇక మిగతా 636 గ్రామీణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు ఆన్‌ లైన్‌ బుకింగ్‌ తో సంబంధం లేకుండా నేరుగా వెళ్లి వ్యాక్సిన్‌ తీసుకునే వెసులుబాటు కల్పించింది. రెండో డోసు కోసం ప్రజలు ఎక్కడికెళ్లాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వ్యాక్సిన్‌ అందుబాటులో లేదని చెబుతుండటంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు 1.10 కోట్ల మందికి పైగా మొదటి డోసు, 26 లక్షల మందికి పైగా రెండో డోసు వేశారు. ప్రతి రోజూ ఎంత మందికి వ్యాక్సిన్‌ వేసేది జత చేస్తూ రిపోర్ట్‌ ను అప్‌ డేట్‌ చేస్తున్నారు. తాజాగా మొదటి డోసును 69,809 మందికి, రెండో డోసును 1,27,686 మందికి వేశారు. అయితే ప్రతి రోజూ వ్యాక్సిన్‌ వేసుకున్న వారెంత మంది ఉంటున్నారో అంతే మంది తిరిగి వెనక్కి వెళుతున్న వారుంటున్నారని క్షేత్రస్థాయిలో సిబ్బంది చెబుతున్నారు. ప్రజలను తిరిగి పంపిస్తుండటంతో వాగ్వాదం చోటు చేసుకుంటున్నది. పోలీసు బందోబస్తు మధ్య నిర్వహించాల్సి వస్తున్నదని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వమే ముందుగా వ్యాక్సిన్ల సరఫరా, ఏయే కేంద్రాల్లో ఎంత మందికి వేస్తారనే సమాచారాన్ని ప్రకటిస్తే ప్రజలకు, క్షేత్రస్థాయి సిబ్బందికి ఉపయోగకరంగా ఉంటుందని పలువురు సూచిస్తున్నారు.

 

- Advertisement -

ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత

Tags:Doses exceeding Rs 10 lakh crore

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page