గోదావరి లో కొనసాగుతున్న వరద పోటు

0 10

ఏలూరు   ముచ్చట్లు:
ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం వెస్ట్ గోదావరి వరద నీటితో పరవళ్ళు తొక్కుతుంది. స్థానిక వలంధర రేవు. లలితమ్మ ఘాట్ ఎన్టీఆర్ ఘాట్ వద్ద వరద నీరు ప్రవహిస్తోంది. పట్టణంలోని ఇసుక ర్యాంపు వరద నీటితో మునిగాయి. ఇదే విధంగా వరద నీరు ప్రమాద స్థాయి చేరుకుంటే ఉభయ గోదావరి జిల్లాల పంటు రాకపోకలు నిలిచి పోయే పరిస్థితి ఏర్పడుతుంది.  మరోవైపు పోలవరం వద్ద గోదావరి వరద కొనసాగుతోంది. పోలవరం ప్రాజెక్ట్ స్పిల్ వే వద్ద  వరద నీటిమట్టం 32.507 మీటర్లు, పోలవరం కాపర్ డ్యాం వద్ద 33.920 మీటర్లు నమోదయింది. పోలవరం స్పిల్ వే నుండి  7,77,911 క్యూసెక్స్ వరద నీరు దిగువకు విడుదల చేసారు. వరద ముంపులో పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని దాదాపు 40 గ్రామాలు వున్నాయి. అధికారులు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలలో 1500మంది నిర్వాసితులు ఆశ్రయం పొందుతున్నారు.

 

ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత

- Advertisement -

Tags:Ongoing flood tide in Godavari

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page