గోవాలో ఆగస్టు 2 వరకూ కర్స్యూ పొడిగింపు

0 11

పనాజీ ముచ్చట్లు :

 

గోవా సర్కారు కరోనా కట్టడికి రాష్ట్రంలో అమలు చేస్తున్న కర్ఫ్యూను ఆగస్టు 2 వరకూ పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. కరోనా కేసులు పెరుగుతున్న నేపధ్యంలో గోవాలో మే 9 నుంచి కరోనా కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. దఫదఫాలుగా పొడిగిస్తూ వచ్చారు. పలు సడలింపులు కూడా ఇచ్చారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఆగస్టు 2 వరకూ రాష్ట్రంలో కర్ఫ్యూను పొడిగిస్తున్నట్లు తెలిపారు. కాగా గోవాలో కొత్తగా 75 కరోనా కేసులు నమోదు కాగా, ఇదే సమయంలో ఆరుగురు మృత్యువాత పడ్డారు. రాష్ట్రంలో కర్ఫ్యూ అమలు చేస్తున్నప్పటికీ ఔషధ దుకాణాలకు, మెడికల్ సంబంధిత కార్యకలాపాల నిర్వహణకు కర్ప్యూ నుంచి మినహాయింపు ఇచ్చారు. ప్రేక్షకులు లేకుండా స్పోర్ట్స్ స్టేడియంలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతించింది.

 

- Advertisement -

ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత

Tags: Curse extension till August 2 in Goa

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page