చట్టసభలలో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల కై బిసి ల పార్లమెంట్ ను ముట్టడి        జంతర్ మంతర్ వద్ద ఆర్.కృష్ణయ్య తో సహా 120 మందిని అరెస్టు

0 11

న్యూ ఢిల్లీ ముచ్చట్లు:

పార్లమెంటులో బిల్లు పెట్టి చట్టసభలలో అసెంబ్లీ – పార్లమెంట్ ఎన్నికల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, బి.సిలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలనీ, డిమాండ్ చేస్తూ నేడు వందలాది మంది బీసీ నాయకులు పార్లమెంట్ ను ముట్టడించారు. ఈ సందర్భంగా పోలీసులు జంతర్ మంతర్ వద్ద 120 మందిని అరెస్టు చేశారు. మందిర్ మార్గ్  పోలీస్ స్టేషన్ కు తరలించారు. ముట్టడి సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్-. తెలంగాణ నుంచి వందలాది మంది బీసీ నాయకులు ఉదయం 11 గంటలకే జంతర్ కు   చేరుకున్నారు. “ఓట్లు బీసీలవి – సీట్లు అగ్రకులాలకా” రాజ్యాధికారంలో వాటా కావాలి. – బి.సిల వాటా బి.సిలకు ఇవ్వాలి – బి.సిలకు రాజ్యాంగ బద్దమైన హక్కులు కల్పించాలని”  – అంటూ నినాదాలు ఇచ్చారు. ఈ ప్రదర్శనలో బి.సి నేతలు గుజ్జ కృష్ణ, లాకా వెంగల్ రావు, నీల వెంకటేష్, లాల్ కృష్ణ, నుకనమ్మ, నాగేశ్వర్ రావు, బోను దుర్గా నరేష్, భుపేష్ సాగర్, ఉదయ్, బర్క కృష్ణ, నంద గోపాల్, కే.నర్సింహ గౌడ్, R.చంద్రశేఖర్ గౌడ్, చంటి ముదిరాజ్, అనంతయ్య, పగిల్ల సతీష్, బైరు నరేష్ గౌడ్, ఉదయ్, బబ్లు గౌడ్, తదితరులు ముట్టడిలో పాల్గొన్నారు .

- Advertisement -

ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత

 

Tags:Invasion of the BC Parliament for 50 per cent reservation for BCs in the Legislature
120 people including R Krishnaiah were arrested at Jantar Mantar

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page