చెక్ డ్యామ్ లో ఈత కొట్టిన మంత్రి శ్రీనివాస్ గౌడ్,దేవర్ కద్ర నియోజకవర్గ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి

0 12

మహబూబ్ నగర్ ముచ్చట్లు:

చెక్  డ్యాంలో నీళ్లు నిండి అలుగు పారుతుండగా రాష్ట్ర ఎక్సైజ్ యువజన సర్వీసులు క్రీడలు సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి  ఉత్సాహంగా ఈతకొట్టి తమ ఆనందాన్ని పంచుకున్నారు. దేవరకద్ర నియోజకవర్గంలోని మూసాపేట మండల పరిధిలోని గౌరీ దేవి పల్లి గ్రామంలో ఐదు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన చెక్ డ్యామ్ నిండి అలుగుపరుతున్న నేపథ్యంలో ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి, ఎమ్మెల్యే నీటిని చూసి ఉత్సాహంగా ఈత కొట్టారు.  దాదాపు గంట సేపు గ్రామస్థులతో కలిసి మంత్రి, ఎమ్మెల్యే నీళ్ల ఆనందాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ దేవరకద్ర నియోజకవర్గం ఒకప్పుడు అభివృద్ధికి దూరంగా ఉండేదని ప్రస్తుతం వాన చినుకులను ఒడిసిపట్టి చెక్ డ్యామ్ లను నీటితో నింపి పచ్చడి పంటలను పండిస్తూ మరో కోనసీమను తలపించే ఉన్నదని ఆనందం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో దేవతగా నియోజకవర్గాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేస్తానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు..

 

- Advertisement -

ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత

Tags:Minister Srinivas Gowda swimming in the check dam, Devar Kadra constituency MLA Ala Venkateshwar Reddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page