ట్రాక్టర్ యజమానుల కుటుంబాల సాంఘీక బహిష్కరణ

0 14

బాల్కోండ  ముచ్చట్లు:
నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలో బాల్కొండ  గ్రామానికి చెందిన 40 ట్రాక్టర్ యజమానుల కుటుంబాలను గ్రామాభివృద్ధి కమిటీ సాంఘీక బహిష్కరణ చేసింది. వివరాల్లోకి వెళ్తే గ్రామంలో గతంలో కేజ్ విల్ ట్రాక్టర్ లు పంట పొలాల్లో దున్నితే 1200 రూపాయలు చెల్లించే వారు  ఇప్పుడు డీజిల్ ధరలు పెరగడంతో కొంచెము ధర పెంచుమని గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులని అడిగారు.  పెంచేది ఏమి లేదని ఇంకా రెండు సంవత్సరాలు ఇలాగే కంటిన్యూ చెయ్యాలని సూచించారు. దానికి ట్రాక్టర్ యజమానులు ఒప్పుకోకపోవడంతో గ్రామాభివృద్ధి కమిటీ వారిని బహిష్కరణ చేసింది.  అంతేకాకుండా వ్యవసాయదారిత పనులకు పూర్తిగా నిషేధించారు. ట్రాక్టర్ లను ఎవ్వరు కూడా తమ పంటపొలాల్లోకి పిలువవద్దని వారి పొలాల్లోకి ఎవరు కూడా వెళ్లవద్దని హుకుం జారీ చేసారు. ఒకవేళ ట్రాక్టర్ లను పనికి పిలిచి నట్లయితే వారికి తగిన లక్ష రూపాల జరిమానా విధించడం జరుగుతుంది అని గ్రామాభివృద్ధి కమిటీ హుకుం జారీ చేసిందని తెలిపారు.

 

ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత

- Advertisement -

Tags:Social exclusion of families of tractor owners

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page