డీఈఈ వైఖరికి నిరసనగా ఉద్యోగుల ధర్నా

0 13

పక్షపాత వైఖరి విడనాడాలని డిమాండ్

జగిత్యాల ముచ్చట్లు:

- Advertisement -

తన పరిధిలో పని చేస్తున్న ఉద్యోగుల అందరిని సమానంగా చూడాల్సిన డివిజన్ స్థాయి అధికారి  అనుకులురకు ఒకతీరు మిగతా వారిపై వివక్షను ప్రదర్శించడం మానుకోవాలని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సమాఖ్య జగిత్యాల జిల్లా శాఖ ఆధ్వర్యంలో ట్రాన్స్కో ఉద్యోగులు సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ ట్రాన్స్కో లోని ఆపరేషన్ విభాగం డీఈఈ ఉద్యోగుల పట్ల వివక్షను ప్రదర్శిస్తున్నారన్నారు. ఉద్యోగులందరిని సమానంగా చూడాల్సిన డివిజన్ స్థాయి
అధికారి తనకు అనుకులురకు ఒకతీరుగా వ్యవహరిస్తూ యూనియన్ ఉద్యోగులకు తీరని అన్యాయం చేస్తున్నాడన్నారు. తనకు అనుకూలంగా ఉన్నవారికి బదిలీ ఆర్డర్స్ ఇస్తూ మిగతా ఉద్యోగులను వేధింపులకు గురిచేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. డీఈఈ అనుసరిస్తున్న విధానాలపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు.ఇప్పటికైనా డీఈఈ తన వైఖరి మార్చుకోవాలని ఉద్యోగులతో సఖ్యతగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం నాయకులు సూచించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ కార్మిక సంఘం జగిత్యాల డివిజన్ ప్రెసిడెంట్ ఎం.సతీష్, డివిజన్ సెక్రటరీ కె.శ్రీధర్ తోపాటు నాయకులు ప్రభాకర్, రహ్మత్ అలీ, ఈ. వేణు, ఎం.సదయ్య, జి. శ్రీధర్, సర్కిల్ ప్రెసిడెంట్ ఆంజనేయులు,సర్కిల్ సెక్రటరీ రాజవీర్లు పాల్గొన్నారు   .

ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత

 

Tags:Employees’ dharna in protest of DEE attitude

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page