నా భార్యను నిర్భందించారు:ఎస్సై వేధిస్తున్నాడు

0 12

టవరెక్కి భర్త హల్ చల్
సంగారెడ్డి ముచ్చట్లు:
ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకున్నారు.. కలలు కన్నారు ఆ కలలకి చిహ్నంగా నెల రోజుల్లో ప్రతి రూపం రానున్న సంతోష సమయంలో శాఖ మంత్రి కేటీఆర్ కి సూసైడ్ నోట్ రాసి నా చూవు కి ఈ లేఖలో ఉన్న మునిపల్లి ఎస్సై తో పాటు మరో ముగ్గురు కారకులంటూ సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేసిన సంఘటన సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండల కేంద్రంలోని మునిపల్లి లో తన భార్యని కాపురానికి పంపించకుండా అత్తింటివారు నిర్బంధించారంటూ భర్త ప్రవీణ్ సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య యత్నానికి ఒడిగట్టాడు. ఒకే గ్రామానికి చెందిన ఆ ఇద్దరు ఒకరికొకరు గాఢంగా ప్రేమించుకున్నారు. పెద్దలు ఒప్పు లేకపోయినా వీరిద్దరు కులమతాలను పట్టించుకోకుండా గత 10 నెలల క్రితం ముస్లిం యువతి దిల్ షిత , ప్రవీణ్ కుమార్ లు ఇద్దరు ఆర్య సమాజం లో  పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం ప్రవీణ్ కుమార్ భార్య దిల్ షిత ఎనిమిది నెలల గర్భవతి. ప్రవీణ్ కుమార్ ఇంట్లో లేని సమయంలో దిల్ షిత అన్న, కుటుంబీకులు ఈ నెల 15వ తేదీన బలవంతంగా తీసుకు వెళ్లారు. తన భార్యను కాపురానికి పంపించండి అంటూ ప్రాధేయపడినా తనను చూపించకుండా అత్తింటివారు నిర్బంధించారు అంటూ ముని పల్లి పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించిన ప్రవీణ్ ఫిర్యాదు చేశాడు. న్యాయం చేయాల్సిన పోలీసు అధికారి వారివైపు మాట్లాడుతూ ప్రవీణ్ కుమార్ ని ఇష్టం వచ్చినట్లుగా బూతు పురాణాలు తిట్టారని సూసైడ్ లేఖలో పేర్కొన్నారు.
ఐదు రోజుల తర్వాత ప్రవీణ్ కుమార్ భార్య కు బలవంతపు మాటలు చెప్పమన్నారని చెప్పకపోతే చంపేస్తామని బెదిరించారని ఆ మాటలు భయపడిన నా భార్యని చూపించి నన్ను మరోసారి తిట్టి నా పై చేయి చేసుకున్నట్లు ఆవేదన వ్యక్తం చేశాడు.
నా భూమి విషయంలో  కూడా సివిల్ కేస్ వెనక్కి తీసుకోవాలంటూ గత రెండు నెలలుగా ఎస్సై మహేశ్వర్ రెడ్డి టార్చర్ చేస్తున్నారు.అంతే కాకుండా నేను ఎక్కడ కనిపిస్తే అక్కడ విడాకుల పేపర్ పై సంతకం చెయ్యు చేస్తే నువ్వు నీ భార్య దగ్గరికి వెళ్తావని పెట్టకపోతే నీ సంగతి చూస్తా జైల్లో పెడతా అంటూ బెదిరిస్తూ టార్చర్ చేస్తున్నాడన్నాడు.దిల్ షిత కుటుంబీకుల నుండి తన భార్యను కాపాడి తన అప్పగించాలంటూ బాధితులు డిమాండ్ చేస్తున్నా న్యాయం చేయాల్సిన పోలీస్ అధికారులు బెదిరింపులకు గురి చేస్తున్నారని టూ మనోవేదనకు గురైన ప్రవీణ్ కుమార్ నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను. నా భార్య ఎనిమిది నెలల గర్భవతి కేవలం పది నిమిషాలు మాట్లాడించండి అంటూ కోరుతూ లేఖ రాశాడు.నా ఆత్మహత్యకి చావు తో పాటు ఒకవేళ నేను మరణించిన తర్వాత కూడా నా భార్యకి ఎస్సై మహేశ్వర్ రెడ్డి, ఎండి.ఇమ్రాన్, షైనాబీ, ఇస్మాయిల్,ఎండి.రఫీ యోద్దిన్ లతో ప్రాణహాని ఉందని వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని కేటీఆర్ సూసైడ్ నోట్ రాసి దీన్ని షేర్ చేయాలని ప్రవీణ్ కుమార్ కోరారు.

 

ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత

- Advertisement -

Tags:My wife was detained: Essay is harassing

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page