నెల్లూరు క్లబ్ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి

0 3

నెల్లూరు  ముచ్చట్లు:
నెల్లూరు గ్రామీణ నియోజకవర్గం పరిధిలోని దర్గామిట్ట ప్రాంతంలో ఉన్న నెల్లూరు క్లబ్ లో అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ ను  నెల్లూరు గ్రామీణ నియోజకవర్గ శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు క్లబ్ లోని సభ్యులందరు కలసిమెలసి ఐక్యమత్యంగా ఉండి, నెల్లూరు క్లబ్ ని అన్నివిధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలి అని సూచించారు. నెల్లూరు క్లబ్ నందు సభ్యుల సౌకర్యార్థం నూతన అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అందుబాటులోకి తీసుకు రావడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా నెల్లూరు క్లబ్ నిర్వహణ కమిటీ సభ్యుల సేవలను కొనియాడారు.
పై కార్యక్రమంలో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయ ఇంచార్జి కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, ఏఎంసి ఛైర్మెన్ యేసు నాయుడు, మాజీ కార్పొరేటర్ బొబ్బల శ్రీనివాస యాదవ్, వైసీపీ సీనియర్ నాయకులు కోడూరు కమలాకర్ రెడ్డి మరియు నెల్లూరు క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత

 

- Advertisement -

Tags:MLA Kotamreddy inaugurated the Nellore Club Administrative Building

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page