పుంగనూరులో జిక్సిన్‌ కంపెనీచే మున్సిపాలిటికి రెండు చెత్త ఆటోలు విరాళం

0 52

పుంగనూరు ముచ్చట్లు:

 

పుంగనూరులో నిర్మిస్తున్న జిక్సిన్‌ గ్యాస్‌ సిలిండర్ల కంపెనీ యాజమాన్యం మున్సిపాలిటిలో చెత్తను తరలించేందుకు రెండు బ్యాటరీ ఆటోలను విరాళంగా అందజేశారు. సోమవారం కంపెనీ డైరెక్టర్‌ అనిరుద్‌ రెండు ఆటోలను కమిషనర్‌ కెఎల్‌.వర్మ, మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషాకు అందజేశారు. ఎంపి పెద్దిరెడ్డి వెంకటమిధున్‌రెడ్డి సూచనల మేరకు తడిచెత్త, పొడిచెత్తను వేరువేరుగా తరలించేందుకు ఆటోలను ఇవ్వడం జరిగిందని డైరెక్టర్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీర్‌ కృష్ణవేణి, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ సఫ్ధర్‌, న్యాయవాదులు వెంకటముని, ఆనందకుమార్‌ పాల్గొన్నారు.

 

- Advertisement -

ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత

Tags; Two garbage autos donated to the municipality by Jixin‌ Company in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page