పుంగనూరులో ప్రేమజంట ఆత్మహత్యాయత్నం

0 312

పుంగనూరు ముచ్చట్లు:

 

పట్టణానికి చెందిన ఫయాజ్‌(27), సబియా(24) అనే ప్రేమజంట పురుగుల మందుతాగి సోమవారం సాయంత్రం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కాగా ఫయాజ్‌కు గత సంవత్సరం నదియా అనే మహిళతో వివాహం జరిగింది. ఇలా ఉండగా ఫయాజ్‌ ప్రేమ విషయం భార్య నదియాకు తెలియడంతో ఆమె పుంగనూరు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు ఆదివారం ఫయాజ్‌పై వరకట్నవేదింపుల కేసు నమోదు చేశారు. ఇలా ఉండగా ఫయాజ్‌ , సబియా కలసి పురుగుల మందుతాగి ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డారు. వెంటనే కుటుంబ సభ్యులు గమనించి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి ఎలాంటి ప్రాణాపాయము లేదని వైద్యులు తెలిపారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత

Tags: Premajanta commits suicide in Punganur

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page