భారత్ కు అమెరికా విదేశాంగ మంత్రి

0 14

న్యూఢిల్లీ ముచ్చట్లు:

భారత్‌ పర్యటనకు వస్తున్న అమెరికా విదేశాంగ మంత్రి.. దేశంలో మానవ హక్కుల ఉల్లంఘన, ప్రజాస్వామ్య వ్యవస్థపై జరుగుతున్న దాడులను ప్రస్తావించనున్నారనే సమాచారంపై కేంద్రం స్పందించింది. ప్రజాస్వామ్య విలువలు, మానవ హక్కుల పరిరక్షణలో భారతదేశం గర్వించదగ్గ విజయాలను సాధించిందని, వైవిధ్యాన్ని గుర్తించిన వారితో పరస్పరం చర్చించుకోవడానికి ఎప్పుడూ తలుపులు తెరిచే ఉంచుతుందని ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి. అమెరికా విదేశాంగ మంత్రిఆంటోనీ బ్లింకేన్ రెండు రోజుల పర్యటన కోసం మంగళవారం వస్తున్న విషయం తెలిసిందే.మానవ హక్కులు, ప్రజాస్వామ్యం సార్వత్రికమైనవి, ఒక నిర్దిష్ట జాతీయ లేదా సాంస్కృతిక దృక్పథానికి మించి విస్తరించి ఉన్నాయని స్పష్టం చేసింది. భారత పర్యటనలో భాగంగా విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌తోనూ ఆంటోనీ బ్లింకేన్ భేటీ అవుతారు. ప్రధాని నరేంద్ర మోదీని కూడా కలవనున్నారు.ఆంటోనీ బ్లింకేన్ పర్యటనపై అమెరికా విదేశాంగ శాఖ సహాయ మంత్రి (దక్షిణ, మధ్య ఆసియా వ్యవహారాలు) డీన్ థాంప్సన్ గతవారం మాట్లాడుతూ.. మానవహక్కులు, ప్రజాస్వామ్యంపై జరుగుతున్న ఘటనలపై చర్చించనున్నారని తెలిపారు. ఈ విషయంలో నిరంతరం భారత్‌తో అమెరికా సంప్రదింపులు జరుపుతూనే ఉంది.. ఇరు దేశాలలో ఒక రకమైన విలువలు ఉన్నాయని అన్నారు.మానవ హక్కులు, ప్రజాస్వామ్య ప్రశ్నకు సంబంధించి మీరు చెప్పింది నిజమే.. మేము వాటి విలువలను పెంచుతామని చెబుతున్నాను.. ఈ అంశంపై సంభాషణను కొనసాగిస్తాం.. ఎందుకంటే మనకు ముందు కంటే అక్కడ ఎక్కువ విలువలు ఉన్నాయని గట్టిగా నమ్ముతున్నాం.. భాగస్వామ్య దేశంతో సంప్రదింపులను కొనసాగించి ఆ రంగాల్లో బలమైన ప్రయత్నాలను నిర్మించడంలో భారత్ చాలా ముఖ్యమైన భాగం అవుతుందని మేము విశ్వసిస్తున్నాం’ అని ఉద్ఘాటించారు.మానవ హక్కులు, ప్రజాస్వామ్యం సార్వత్రికమైనవి, ఒక నిర్దిష్ట జాతీయ లేదా సాంస్కృతిక దృక్పథానికి మించి విస్తరించి ఉన్నాయి.. వీటి పరిరక్షణలో భారతదేశం గర్వించదగ్గ విజయాలను సాధించింది.. వైవిధ్యాన్ని గుర్తించిన వారితో పరస్పరం చర్చించుకోవడానికి, అనుభవాలను పంచుకోడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాం..దీర్ఘకాలం నుంచి బహుళ సమాజంగా వర్ధిల్లుతోంది.. వైవిధ్యం విలువను ప్రస్తుతం గుర్తించిన వారితో చర్చించడానికి తలుపులు తెరిచే ఉంటాయి’ అని పేర్కొన్నారు.అమెరికా విదేశాంగ మంత్రితో చర్చల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజకీయ, సాంస్కృతిక సమతౌల్యతపై కూడా చర్చించినున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ‘భారత్ నిజమైన బహుళ ప్రజాస్వామ్య, విభిన్న ప్రపంచ క్రమాన్ని సమర్థిస్తుంది.. అంతర్జాతీయ సంభాషణలు ఈ పరిణామాన్ని ప్రతిబింబిస్తాయని ఆశిస్తున్నాం.. అభివృద్ధి, వాతావరణ మార్పు, లేదా ప్రపంచ నిర్ణయాధికారం వంటి వాటిలో భాగస్వామ్యం, నిబద్ధతను మేం నమ్ముతున్నాం’ అని తెలిపింది.

 

- Advertisement -

ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత

Tags:US Secretary of State for India

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page