మళ్లీ పెరుగుతున్న కొవిడ్‌ కేసులు

0 9

హైదరాబాద్‌ ముచ్చట్లు :

 

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయని వైద్య శాఖ చెబుతోంది. కానీ, ఆస్పత్రుల్లో రోగుల చేరికలు చూస్తే పరిస్థితులు దీనికి విరుద్ధంగా ఉన్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వ గణాంకాల ప్రకారమే చూస్తే వారం నుంచి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య క్రమేపీ అధికమవుతోంది. వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్‌ ప్రకారం రాష్ట్రంలో ఈ నెల 15 నుంచి రోజుకు సగటున 650-725 కేసులు నమోదవుతున్నాయి. కొద్దికొద్దిగా కేసులు తగ్గుతున్నట్లు చూపుతున్నారు. ఆస్పత్రుల్లో చేరికలు కూడా ఇలాగే తగ్గాలి. కానీ, పెరుగుతుండటం గమనార్హం. ఈ నెల 23 నాటికి ఆస్పత్రుల్లో 3,809 మంది రోగులుంటే ఆదివారం ఆ సంఖ్య 3,906 (ఆక్సిజన్‌పై 1761, ఐసీయూ, వెంటిలేటర్‌పై 1344 మంది)కి చేరినట్లు వైద్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. అంటే, రెండు రోజుల్లోనే కొత్తగా వందిమంది ఆస్పత్రుల్లో చేరారు.

- Advertisement -

ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత

Tags: Covid‌ cases rising again

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page