మహిళా సర్పంచ్‌లే రావాలి -భర్తలు పెత్తనం చెలాయించవద్దు- వైఎస్‌ఆర్‌సిపి రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి

0 562

-ప్రభుత్వ ఆశయాన్ని కాపాడండి
– మహిళలకు చేయూతనివ్వండి

 

పుంగనూరు ముచ్చట్లు:

 

- Advertisement -

వైఎస్‌ఆర్‌సిపి అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి గ్రామ పరిపాలనను పటిష్టం చేసేందుకు మహిళలకు 50 శాతం పైగా పదవులు కేటాయించారని, అలాంటి మహోన్నతమైన ఆశయాన్ని ప్రతి ఒక్కరు కాపాడాలని, మహిళల స్థానంలో వారి భర్తలు వచ్చి పెత్తనాలు చెలాయిస్తే సహించేది లేదని….. మహిళల అభివృద్ధికి చేయూతనివ్వాలని వైఎస్‌ఆర్‌సిపి రాష్ట్ర కార్యదర్శి,జెడ్పిమాజీ వైస్‌ చైర్మన్‌ పెద్దిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం పుంగనూరు నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన సర్పంచ్‌ల మూడురోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధులుగా జెడ్పి సీఈవో ప్రభాకర్‌రెడ్డి, అమరావతి నుంచి వచ్చిన స్పెషలాఫీసర్‌ నరసింహారావు, మండల అభివృద్ధి కమిటి చైర్మన్‌ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, మదనపల్లె అర్భన్‌డెవలెప్‌మెంట్‌ అధ్యక్షుడు వెంకటరెడ్డి యాదవ్‌, కమిషనర్‌ కెఎల్‌.వర్మ, చైర్మన్‌ అలీమ్‌బాషా , పంచాయతీరాజ్‌రాష్ట్ర కౌన్సిలర్‌ అంజిబాబు హాజరైయ్యారు. ఈసందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ పుంగనూరు నియోజకవర్గంలో మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి 50 శాతం పైగా మహిళలకు స్థానిక సంస్థల్లో అవకాశం కల్పించారని కొనియాడారు. మహిళ ప్రజాప్రతినిధులు సమావేశాలకు, ప్రభుత్వ కార్యక్రమాలకు విధిగా రావాలన్నారు. వీరి స్థానంలో భర్తలు వస్తే అధికారులు అనుమతించవద్దని స్పష్టం చేశారు. అలాగే చెక్కులు రాసే అధికారం కూడ భర్తలే తీసుకుంటా…? ఇలా చేస్తే సహించేది లేదు. ఈ విషయాలను మంత్రి పెద్దిరెడ్డికి నివేదిస్తాం. భవిష్యత్తులో ఇలా జరగనివ్వకుండ ప్రతి ఒక్కరు మహిళలకు చేయూతనివ్వాలని కోరారు.

ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత

Tags: Only women sarpanches should come – Husbands should not abuse power – YSRCP state secretary Peddireddy

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page