మావోలకు వ్యతిరేకంగా వెలసిన బ్యానర్లు

0 9

రాజమండ్రి   ముచ్చట్లు:
తూర్పుగోదావరి జిల్లా చింతూరు మన్యంలోని మావోయిస్ట్ ప్రభావిత గ్రామాల్లో మావోలకు వ్యతిరేకంగా ఆదివారం సాయంత్రం  బ్యానర్లు కనిపించాయి.   ఈ బ్యానర్లు మండలంలోని పేగ, అల్లిగూడెం, సూరకుంట గ్రామాల్లో అల్లూరి ఆదివాసీ సమితి పేరుతో  బ్యానర్లు వుండడం కలకలం రేపాయి.  ఈ బ్యానర్లలో గిరిజన ప్రాంతాల్లో అభివృద్ధి కోసం రోడ్లు వేస్తుంటే గుత్తేదారుల నుండి డబ్బులు వసూళ్ళు చేసి వారి వాహనాలను తగలబెట్టడం ఇవేనా మీరు ప్రజలకు చేసే న్యాయం ?అని మావోలను ప్రశ్నిస్తూ ఉన్నాయి.  అభివృద్ధికి ఆటంకంగా మారడమేనా మావోయిస్టుల సిద్ధాంతమా ? అని వ్రాసి ఉన్నాయి. ఈ నెల 28 వ తేది నుండి ఆగష్టు 3 వ తేదీ వరకు మావోయిస్టుల వారోత్సవాలు ఉన్న నేపథ్యంలో ఈ బ్యానర్లు వెలవడం గమనార్హం…

 

జిల్లా ఎంపీడీవోల సంఘ నాయకుడు లక్ష్మీపతినాయుడు మృతి

- Advertisement -

Tags:Banners against the Maoists

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page