వావి వరసలు మరిచిపోయిన తండ్రి

0 14

హైదరాబాద్ ముచ్చట్లు:
కొంతమంది నీచంగా ఆలోచిస్తూ.. అరాచకాలకు పాల్పడుతున్నారు. వాయి వరుసలు చూడకుండా.. నీచానికి ఒడిగడుతున్నారు. ఇలానే ఓ వ్యక్తి కన్న బిడ్డలపైనే కర్కషంగా వ్యవహరించి.. తండ్రి అనే పదానికి మాయని మచ్చ తెచ్చాడు. కన్నకొడుకు, కూతురు పట్ల అసభ్యంగా ప్రవర్తించిన ఓ తండ్రిపై హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. దీంతో పోలీసులు ఆ వ్యక్తిపై ఫోక్సో చట్టంతోపాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‌ జిల్లాకు చెందిన ఓ మాజీ ఎమ్మెల్యే కుమారుడు (45) జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెం.70లో నివాసం ఉంటున్నారు. అతనికి 2003లో వెంకటగిరికి చెందిన మహిళ (40) తో వివాహమైంది. వివాహం అనంతరం అమెరికాలో నివాసమున్న ఈ దంపతులు 2010 లో హైదరాబాద్ నగరానికి తిరిగి వచ్చారు. వీరికి కూతురు (14), కొడుకు (11) ఉన్నారు. 2018లో కుటుంబ కలహాల కారణంగా భార్యాభర్తలిద్దరూ వేర్వేరుగా నివాసం ఉంటున్నారు. ఇద్దరూ విడాకులకు కూడా దరఖాస్తు చేసుకున్నారు.గత కొంతకాలంగా కూతురు, కుమారుడు దిగులుగా ఉంటుండటంతో.. తల్లి పిల్లలను సైకాలజిస్ట్‌ వద్దకు తీసుకెళ్లింది. కౌన్సెలింగ్‌ ఇప్పించగా మూడేళ్ల క్రితం తమపై తండ్రితో పాటు అతడి స్నేహితుడు అసభ్యకరంగా ప్రవర్తించినట్లు వెల్లడించారు. ఎవరూ లేని సమయంలో తండ్రి, అతని స్నేహితుడు తన శరీర భాగాలను తాకుతూ అసభ్యంగా ప్రవర్తించారని కూతురు వెల్లడించింది. తనను నగ్నంగా చేసి అసభ్యంగా, దారుణంగా ప్రవర్తించేవాడని కుమారుడు పేర్కొన్నాడు. దీంతో తల్లి జూబ్లీహిల్స్‌ పోలీసులను ఆశ్రయించింది. ఈ మేరకు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి.. నిందితుడిని అరెస్ట్‌ చేసి ఆదివారం రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు వెల్లడించారు. పరారీలో ఉన్న అతని స్నేహితుడి కోసం గాలిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

 

ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత

- Advertisement -

tags:Vavi is the father who forgot the lines

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page