విపత్కర పరిస్థితులలో మహిళల రక్షణ కోసమే దిశాయాప్-సీఐ శివ కుమార్ రెడ్డి

0 14

సత్యవేడు ముచ్చట్లు:

విపత్కర పరిస్థితుల్లో మహిళలు చిక్కుకున్నప్పుడు వారి రక్షణ కోసమే ప్రభుత్వం దిశాయాప్ ను తీసుకువచ్చినట్టు చిత్తూరు జిల్లా సత్యవేడు సర్కిల్ ఇన్స్పెక్టర్ శివకుమార్ రెడ్డి గుర్తు చేశారు .సోమవారం పోలీసుశాఖ ఆధ్వర్యంలో స్థానిక బేరిశెట్టి కళ్యాణ మండపంలో దిశాయాప్పై జరిగిన అవగాహన సదస్సుకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు .ఈ సందర్భంగా సిఐ శివ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గతంలో ఉద్యోగరీత్యా , వ్యాపారపరంగా ప్రతి కుటుంబంలో ఇంటి యజమానులు మాత్రమే బయటకు వెళ్లే వారన్నారు .అయితే సామాజిక పరిస్థితులు , ఆర్థిక అవసరాలు పెరగడం వల్ల ప్రస్తుతం ప్రతి కుటుంబంలో భార్యాభర్తలు ఇరువురు కూడా పనులకు వెళ్లే పరిస్థితి వచ్చిందన్నారు . తద్వారా అక్కడక్కడ మహిళలపై అఘాయిత్యాలు పెరుగుతున్న నేపథ్యంలో వీటిని నిర్మూలించడం తోపాటు మహిళల భద్రతపై ప్రభుత్వం దృష్టిసారించిందన్నారు . ఇందులో భాగంగానే మహిళా రక్షణ కోసం దిశాయాప్ను రూపొందించడం జరిగింది అన్నారు .

 

 

- Advertisement -

మహిళలు ఎక్కడైనా శత్రువుల బారిన పడ్డప్పుడు దిశాయాప్ లోని ఎస్ఓ ఎస్ బటన్ను నొక్కడం ద్వారా సమాచారం కంట్రోల్ రూమ్కి చేరి రెప్పపాటుకాలంలో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మహిళలను రక్షిస్తారు అన్నారు .ఒకసారి దిశ యాప్ను ఓపెన్ చేసే పరిస్థితి లేనప్పుడు కూడా ఫోన్ను ఐదు సార్లు షేక్ చేయడం వల్ల లొకేషన్ తోపాటు సమాచారం పోలీసు కంట్రోల్ రూమ్ కి చేరుతుందన్నారు .అందువల్ల మహిళల భద్రతకు దిశయాప్ ఒక వజ్రాయుధంగా పని చేస్తుందని ఆయన చెప్పారు .ప్రతిమహిళ వారి ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్లో దిశ యాప్ ను డౌన్లోడ్ చేసుకుని సద్వినియోగం చేసుకోవాలని మహిళా సంఘమిత్రులను కోరారు .మహిళలలే కాకుండా పురుషులు కూడా దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకొని మహిళల రక్షణ కోసం పాటుపడాలన్నారు . పైగా దిశాయాప్లో ప్రతి మహిళ వారి కుటుంబ సభ్యులు ,స్నేహితులు ,బంధువుల మొబైల్ ఫోన్ నెంబర్లను కూడా సేవ్ చేసుకుంటే విపత్కర పరిస్థితుల్లో వారికి కూడా సమాచారం అందుతుందన్నారు .అందుకని ప్రతి మహిళ దిశ యాప్ను డౌన్లోడ్ చేసుకుని వినియోగించుకోవాలని ఆయన కోరారు .ఈ కార్యక్రమంలో స్థానిక ఎస్ఐలు ప్రతాప్ , వీరాంజనేయులు ,ఏఎస్ఐ దయానిధి నాయుడు ,ఎంఈఓ రవి ,వెలుగు ఏపీఎం స్వర్ణలత ,పౌరసరఫరాల అధికారి భగవతి , సింగిల్విండో చైర్మన్ నిరంజన్ రెడ్డి ,సత్యవేడు సర్పంచ్ మంజుల రమేష్ ,మహిళా పోలీసులు సంగీత ,ప్రత్యూష ,చంద్రకళ ,ధనలక్ష్మి , జోష్నా ,నిహారిక ,పలువురు మహిళ సంఘమిత్రలు తదితరులు పాల్గొన్నారు .

ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత

Tags: Dishayap-CI Shiv Kumar Reddy is for the protection of women in catastrophic situations

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page