వైసీపీ గూటికి వెలగపూడి

0 12

విశాఖపట్టణం  ముచ్చట్లు:

విశాఖ జిల్లాలో ఆయన సీనియర్ ఎమ్మెల్యే. ఇక ఎక్కడో కృష్ణా జిల్లా నుంచి వచ్చి విశాఖలో వరసగా మూడు సార్లు గెలిచిన నేతగా ఆయనకు పార్టీలో మంచి గుర్తింపు ఉంది. అటు నారా, ఇటు నందమూరి సపోర్ట్ కూడా ఈ ఎమ్మెల్యేకు బాగా ఉంది. అయితే ఇపుడు మాత్రం ఈ ఎమ్మెల్యే మీద అధినాయకత్వం కొంత అనుమానం చూపులు చూస్తున్నట్లుగా చెబుతున్నారు. దానికి కారణం ఆయన మీద ఉన్న ఆరోపణలే. అవి చేసినది కూడా ఎవరో కాదు, బాలయ్య చిన్నల్లుడు శ్రీభరత్. ఆయన విశాఖ ఎంపీ అభ్యర్ధిగా టీడీపీ తరఫున పోటీ చేస్తే వెలగపూడి రామకృష్ణ చివరి నిముషంలో హ్యాండ్ ఇచ్చారని అప్పట్లోనే ప్రచారం జరిగింది.ఇక వెలగపూడి వైసీపీ నుంచి ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేసిన బిల్డర్ ఎంవీవీ సత్యనారాయణకు మద్దతు ఇచ్చి గెలిపించారని కూడా శ్రీ భరత్ పెద్ద డౌటే పడ్డారు. అది నిజమనేలా ఆధారాలు కూడా ఉన్నాయని అంటున్నారు ,

- Advertisement -

ఇప్పటికీ వైసీపీ ఎంపీకి, వెలగపూడి రామకృష్ణకి మధ్య మంచి రిలేషన్స్ ఉనాయని చెబుతారు. దాంతో పాటు ఇద్దరూ కలసి వ్యాపారల లావాదేవీల్లో కూడా ఉన్నారని అంటారు. దాంతో శ్రీభరత్ అధినాయకత్వానికి చేసిన ఫిర్యాదుతో ఇపుడు ఆయన పోకడల మీద దృష్టి పెట్టారని అంటున్నారు.ఇక వెలగపూడి రామకృష్ణ మూడు సార్లు విశాఖ తూర్పు నుంచి గెలిచారు. అయితే తాజాగా జరిగిన కార్పోరేషన్ ఎన్నికల్లో మొత్తం 15 వార్డులకు గానూ మూడు మాత్రమే టీడీపీ తూర్పులో టీడీపీ గెలిచింది. మెజారిటీ వైసిపీ తన్నుకుపోయింది. దాంతో వెలగపూడి రామకృష్ణ పట్టు జారుతోందని కూడా టీడీపీ పెద్దలు అంచనాకు వస్తున్నారుట. మరో వైపు మూడు సార్లు ఎమ్మెల్యెకావడంతో ఆయన మీద వ్యతిరేకత సహజంగా ఉంటుందని కూడా ఆలోచిస్తున్నారుట. ఇక తూర్పులో బలంగా ఉన్న ఇతర సామాజిక వర్గాలకు ఈసారి టికెట్ ఇవ్వాలని కూడా టీడీపీలో చర్చ సాగుతోందిట.ఇక వెలగపూడి రామకృష్ణ కమ్మ సామాజికవర్గం. వచ్చే ఎన్నికల్లో లోకేష్ భీమిలీ నుంచి పోటీ చేయాలని అనుకుంటున్నారు. అలాగే శ్రీ భరత్ విశాఖ నార్త్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ పడతారు అంటున్నారు. ఈ నేపధ్యంలో ముగ్గురు కమ్మలకు ఒకే జిల్లాలో సీట్లు ఇవ్వడం కుదరదు. ఆ సమీకరణలతోనే వెలగపూడి రామకృష్ణని పక్కన పెట్టేస్తారు అన్న టాక్ అయితే గట్టిగానే ఉంది మరి. వెలగపూడి కూడా ఈ విషయాలు ముందే ఊహించి అప్పట్లో భరత్ విషయంలో చేయాల్సింది చేశారు అంటున్నారు. మరి వెలగపూడి రామకృష్ణకి బాలయ్య మద్దతు గతంలో ఉండేది. ఆయన రెండవ అల్లుడికే ఠోకరా ఇస్తే ఆయన ఊరుకుంటారా. పైగా లోకేష్ బాబు కూడా గుస్సా మీద ఉన్నారని అంటున్నారు. మొత్తానికి వెలగపూడి మాజీ ఎమ్మెల్యేగా మిగిలిపోవాల్సిందే అంటున్నారు.

 

జిల్లా ఎంపీడీవోల సంఘ నాయకుడు లక్ష్మీపతినాయుడు మృతి

Tags:Velagapudi to YCP Gooty

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page