సింగరేణి కార్మికుల పదవీ విరమణ వయసును 61 సంవత్సరాలకు పెంపు

0 9

హైదరాబాద్‌ ముచ్చట్లు:

సింగరేణి కార్మికులకు పదవీ విరమణ వయసును 61 సంవత్సరాలకు పెంచుతున్నట్లు సింగరేణి అధికారులు, కార్మికులకు యాజమాన్యం ప్రకటించింది. సోమవారం జరిగిన బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్ల సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు సీఎండీ శ్రీధర్‌ తెలిపారు. వయసు పెంపు నిర్ణయం ఈ ఏడాది మార్చి 31 నుంచి అమలులోకి రానుందని చెప్పారు. ఈ నిర్ణయంతో మార్చి 31 జూన్‌ 30 మధ్య పదవీ విరమణ చేసిన వారికి మళ్లీ ఉద్యోగాలు వస్తాయని.. 43,899 మంది అధికారులు, కార్మికులకు లబ్ధి చేకూరుతుందని సింగరేణి సీఎండీ శ్రీధర్‌ తెలిపారు. సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు పదవీ విరమణ వయసును పెంచుతూ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. పెళ్లయిన, విడాకులు పొందిన కుమార్తెలకూ కారుణ్య నియామకాల్లో అవకాశం దక్కనుంది. ఈ సందర్భంగా సింగరేణి ఉద్యోగాల్లో 10శాతం ఈబీసీ రిజర్వేషన్ల అమలుకు బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లు ఆమోదం తెలిపినట్లు సీఎండీ చెప్పారు. సింగరేణిలో అన్ని ఉద్యోగాలకు లింగబేధం లేకుండా అవకాశాలకు అనుమతికి సమావేశం ఆమోదం తెలిపినట్లు వివరించారు.

 

- Advertisement -

ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత

Tags:Raising the retirement age of Singareni workers to 61 years

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page