స్పందన కార్యక్రమానికి 43 వినతులు,నంద్యాల సబ్ కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్

0 14

నంద్యాల  ముచ్చట్లు:

స్పందన కార్యక్రమానికి 43 వినతులు  వచ్చాయి అని  నంద్యాల సబ్ కలెక్టర్  చాహత్ బాజ్ పాయ్  అన్నారు.
సోమవారం నంద్యాల సబ్ కలెక్టర్ వారి కార్యాలయంలో జరిగిన స్పందన కార్యక్రమంలో  నంద్యాల సబ్ కలెక్టర్  చాహత్ బాజ్ పాయ్.  సబ్ కలెక్టర్ కార్యాలయం  పరిపాలన అధికారి హరినాథ్ రావు లతో కలిసి వినతులను స్వీకరించారు.
అనంతరం నంద్యాల సబ్ కలెక్టర్ కుమారి చాహత్ బాజ్ పాయ్ మాట్లాడుతూ  సోమవారం రోజు నంద్యాల సబ్ కలెక్టర్ వారి కార్యాలయంలో  నంద్యాల రెవెన్యూ డివిజన్ లోని 17 మండలాల తహశీల్దార్ల ను వీడియో కాన్ఫరెన్స్ అనుసంధానంతో స్పందన కార్యక్రమం నిర్వహించామన్నారు . నంద్యాల రెవెన్యూ డివిజన్ నలుమూలల  నుండి వచ్చిన వినతిదారు ల నుండి వినతులను స్వీకరించామన్నారు.  వినతిదారుల సమస్యలను   అప్పటికీ అప్పుడే  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  ఆయా మండలాల తహసీల్దార్లు తో మాట్లాడి వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నాం అన్నారు. నంద్యాల రెవెన్యూ డివిజన్ లోని 17 మండల తహసిల్దార్  వారి కార్యాలయంలలో ప్రతి సోమవారం నిర్వహించే  స్పందన కార్యక్రమంలో ప్రజల నుండి వినతులను స్వీకరించడం జరుగుతుందన్నారు. మన  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సచివాలయ వ్యవస్థలో క్షేత్రస్థాయిలో కూడ సచివాలయల నుండి వినతులు స్వీకరించబడు తాయి అని అన్నారు. వినతి దారులు సచివాలయాల్లో. తహసీల్దార్ కార్యాలయాల్లో. సమస్యలు  పరిష్కారం కానప్పుడు నంద్యాల సబ్ కలెక్టర్ కార్యాలయం కు రావాలన్నారు సోమవారం జరిగిన స్పందన కార్యక్రమం లో ఎక్కువ శాతం భూముల సర్వే చేయించాలని. భూములను ఆక్రమించారని. భూములు ఆన్లైన్లో నమోదు చేయించాలని వికలాంగుల పింఛన్ .వృధాప్య పింఛన్ ఇపించాలని .భూములను  ఆన్లైన్లో నమోదు  చేయించాలని. పట్టాదారు పాసు పుస్తకాలు కావాలని  ప్రభుత్వం ఇచ్చినటువంటి  గృహాలను ఆక్రమించుకున్నారని . పంట భూములకు రస్తా కావాలని. నంద్యాల రెవెన్యూ డివిజన్ లోని   రేషన్ రోడ్ డెలివరీ చేయు వాహనదారులు  వాహనాల రిపేరీ లకు. నంద్యాల పట్టణంలోనే ఒక్క వర్క్ షాప్ ఏర్పాటు చేయించాలని. కోరుతూ అర్జీ ఇచ్చారన్నారు. సోమవారం నాడు జరిగిన స్పందన కార్యక్రమానికి 43 వినతులు అందినాయని అన్నారు.

- Advertisement -

ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత

 

Tags:43 requests for response program, Nandyala sub-collector Chahat Bajpayee

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page