స్వతంత్ర అభ్యర్థులతో ఎవరికి ముప్పు

0 12

కరీంనగర్ ముచ్చట్లు:
హుజూరాబాద్ ఉప ఎన్నిక అన్ని పార్టీలకూ ప్రతిష్టాత్మకంగా మారింది. ఇక్కడ గెలుపు గుర్రం ఎక్కేందుకు అన్ని పార్టీలు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించాయి. అభ్యర్థులను ఖరారు చేయకపోయినా టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. పార్టీ గుర్తునే హైలెట్ చేస్తూ ప్రచారాన్ని షురూ చేశాయి. అయితే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో చిన్న పార్టీలు కూడా కీలకంగా మారనున్నాయి.హుజూరాబాద్ నియోజకవర్గం టీఆర్ఎస్ కు కంచుకోట. వరస గెలుపులతో పార్టీ మంచి ఊపు మీద ఉంది. అయితే అది ఈటల రాజేందర్ బలమా? లేక టీఆర్ఎస్ కారు గుర్తు వల్లనేనా? అన్నది తేలాల్సి ఉంది. హుజూరాబాద్ నియోజకవర్గంలో మొత్తం 2.05 లక్షల మంది ఓటర్లున్నారు. ఇందులో ఓసీలు 40 వేలు ఉన్నారు. ఎస్సీ ఓటర్లు 52 వేల మంది ఉన్నారు. బీసీలు మాత్రం 1.02 లక్షల మంది ఉన్నారు.బీసీ ఓటర్లే హుజూరాబాద్ లో కీలకంగా మారారని చెప్పక తప్పదు. ఈటల రాజేందర్ బీసీ కాదని చెప్పే ప్రయత్నం బలంగా జరుగుతుంది. ఆయన కుటుంబం మొత్తం రెడ్డి సామాజికవర్గం అని అధికార పార్టీ ప్రచారం మొదలు పెట్టింది. కానీ ఈటల రాజేందర్ మాత్రం తాను బీసీయేనని బలంగా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఎక్కువ మంది బీసీ అభ్యర్థులు బరిలోకి దిగే అవకాశాలు కన్పిస్తున్నాయి.తెలంగాణ జనసమితి కూడా తాము హుజూరాబాద్ లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆ పార్టీ అధినేత కోదండరామ్ ప్రకటించారు. టీజేఎస్ కూడా బీసీ అభ్యర్థినే బరిలోకి దించాలని ప్రయత్నాలు చేస్తుంది. బీసీల్లో కులాల పరంగా బలమైన అభ్యర్థిని పోటీలోకి దింపాలని కాంగ్రెస్ భావిస్తుంది. ఇప్పటికే అన్ని కులాలకు చెందిన మంత్రులు, సీనియర్ నేతలు ప్రచారంలో పాల్గొంటున్నారు. హుజూరాబాద్ లో ఎక్కువ మంది బీసీ అభ్యర్థులు ఇండిపెండెంట్ గా పోటీ చేసే అవకాశాలున్నాయి. వారిని పార్టీలే బరిలోకి దింపే వ్యూహంలో ఉన్నాయి. దీంతో బీసీ ఓట్లను చీల్చాలనే ప్రయత్నం హుజూరాబాద్ లో జరిగే అవకాశముంది.

ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత

 

- Advertisement -

Tags:Who is threatened with independent candidates

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page