అయోమయం లో రామప్ప దేవాలయ ప్రాంతం లోని చిరు వ్యాపారులు

0 12

వరంగల్‌ ముచ్చట్లు :

చారిత్రాత్మక రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తించడం తో చిరు వ్యాపారులకు శాపంగా మారింది.దేవాలయానికి వారసత్వ హోదా వచ్చిందని సంతోషించాలో.. బాధపడాలో తెలియని పరిస్థితుల్లో స్థానిక చిరు వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు. ఎన్నో ఏళ్లుగా ఆలయం ముందు చిరు వ్యాపారాలు పెట్టుకొని జీవనం కొనసాగిస్తున్న వారికి యునెస్కో ప్రతిపాదన జీవనోపాధి దూరం చేసింది. ఆలయానికి సుమారు 100 మీటర్ల దూరంలో ఎలాంటి దుకాణాలు, కట్టడాలు ఉండకూడదనేది యునెస్కో ప్రధాన నిర్ణయం.గతం లో ఈ ఆంశం ఆధారంగానే వేయిస్తంభాలగుడి, వరంగల్‌ కోట కట్టడాలు తిరస్కరణకు గురయ్యాయి. అదీ పరిస్థితి రామప్ప ఆలయానికి వస్తుందా అన్నది చర్చనీయంశంగా మారింది. యునెస్కో గుర్తింపు కోసం కేంద్రం డోషియార్‌ (రామప్ప సమగ్ర వివరాలతో కూడిన పుస్తకం)ను తయారు చేసి ప్రతిపాదించింది. ఈ క్రమంలో డోషియార్‌లో పొందుపరిచిన విషయాలను క్షేత్రస్థాయిలో పరీశీలించేందుకు 2019 సెప్టెంబర్‌లో యునెస్కో ప్రతినిధి వాసు పోశ్యానందన పర్యటన జరిగింది. దీంతో రామప్ప ఆలయం ముందు ఉన్న చిరు వ్యాపారుల కట్టడాలను కూల్చివేసి దుకాణాలను తొలగించారు. యునెస్కో ప్రతినిధి పర్యటన పూర్తయ్యాక ఆలయానికి దగ్గరలో ఉన్న పార్కింగ్‌ స్థలంలో తాత్కాలికంగా దుకాణాలు ఏర్పాటు చేసుకునేందుకు అధికారులు అనుమతించారు.ఆలయానికి వచ్చిన పర్యాటకులు పార్కింగ్‌ స్థలంలో ఉన్న దుకాణాల వద్దకు వెళ్లి కోనుగోలు చేయకపోవడంతో వ్యాపారం సరిగా జరగలేదు. దీంతో ఆలయం ముందు దుకాణాలు ఏర్పాటు చేసుకునేలా అనుమతి ఇవ్వాలని, లేదా తూర్పు ముఖద్వార రోడ్డు వద్ద పర్మనెంటుగా స్థలాలను కేటాయించాలని చిరు వ్యాపారులు కోరుతున్నారు.

- Advertisement -

ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత

 

Tags:Small traders in the Ramappa temple area in confusion

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page