ఆగష్టు 9 న భారత రక్షణ దినాన్ని జయప్రదం చేద్దాం.

0 20

సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు పాలడుగు సుధాకర్

జగిత్యాల  ముచ్చట్లు :

- Advertisement -

క్విట్ ఇండియా ఉద్యమ స్పూర్తితో ఆగష్టు 9న దేశవ్యాప్తంగా సీఐటీయూ, రైతు వ్యవసాయ కార్మిక సంఘాలు భారత రక్షణ దినాన్ని నిర్వహించాలని పిలుపు నిచ్చాయని,దానిని విజయవంతం చేద్దామని సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు పాలడుగు సుధాకర్ పిలుపు నిచ్చారు. మంగళవారం జగిత్యాలలోని ద్రోణ ఓకేషనల్ కళాశాలలో సీఐటీయూ, రైతు వ్యవసాయ కార్మిక సంఘాల సంయుక్త సమావేశాన్ని తిరుపతి నాయక్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి  సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు పాలడుగు సుధాకర్  ముఖ్య అతిధిగా హజారే మాట్లాడుతూ  కేంద్ర ప్రభుత్వ ప్రజా కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిగటిస్తూ జులై 25 నుంచి ఆగస్టు 8 వరకు అఖిల భారత స్థాయిలో ఆందోళనలకు, నిరసన కార్యక్రమాలకు పిలుపు నిచ్చారన్నారు. అలాగే ఆగస్టు 9 న భారత రక్షణ దినోత్సవాన్ని నిర్వహించాలని పిలుపునిచ్చామన్నారు. కేంద్రంలో ఏడు ఏండ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఎముకల్లోని ములుగను సైతం పీల్చుతున్నదన్నారు. ప్రపంచాన్ని వణికించిన కరోనా కు వ్యాక్సిన్ దొరికిందని, కాషాయ ఫంగస్ కు సరైన వ్యాక్సిన్ దొరకడం లేదన్నారు. దేశ సార్వభౌమాధికారానికి, సాధికారథకు నిదర్శనంగా నిలిచిన ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేటు శక్తులకు కేంద్రం అప్పగిస్తోన్నదన్నారు. 120 ఏండ్ల కింద పోరాడి సాధించిన కార్మిక చట్టాలను సవరణల పేరుతో మార్పులు చేస్తూ కార్మికులను కట్టు బానిసలుగా మార్చేందుకు కేంద్రం కుట్రలు చేస్తోందన్నారు. కరోన టైంలో ఆక్సిజన్ అందక ప్రాణాలు పోయిన పట్టించుకోని కేంద్రప్రభుత్వం పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్ పైన నియంత్రణ పూర్తిగా ఎత్తి వేసిందన్నారు. ఎన్నో సమస్యలు కేంద్ర ప్రభుత్వానికే కనిపిస్తున్నా ఎలాంటి పట్టింపులు లేవని అందుకే సమస్యల పరిష్కారానికి సంఘటిత పొరాటాలే మార్గమని అగస్ట్ 9న ఇచ్చిన భారత రక్షణ దినోత్సవాన్ని జయప్రదం చేద్దామని పాలడుగు సుధాకర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కో కన్వీనర్ సులోచన, మధ్యాన భోజన సంఘం జిల్లా అధ్యక్షురాలు గౌరమ్మ, బీడీ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి చౌదరి, రైసుమిల్లుల సంఘం జిల్లా నాయకులు రత్నాకర్, లింగయ్య లు వున్నారు.

ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత

 

Tags:Let’s celebrate Indian Defense Day on August 9.

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page