ఆగస్టు తర్వాత చిన్నారులకు టీకాలు

0 19

న్యూఢిల్లీ ముచ్చట్లు :

 

దేశంలో కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతంగా కొనసాగుతోంది. ప్రస్తుతం దేశంలో 18 ఏళ్లకు పైబడిన వారికి వ్యాక్సిన్ వేస్తున్నారు. అయితే.. త్వరలోనే చిన్నారులకు సైతం వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మ‌న్సూక్ మాండ‌వీయ కీలక ప్రకటన చేశారు. ఆగ‌స్టు క‌ల్లా చిన్నారులకు సైతం కోవిడ్ టీకాలు అందుబాటులోకి వ‌చ్చే అవ‌కాశాలున్నట్లు వెల్లడించారు. మంగళవారం జరిగిన బీజేపీ పార్లమెంటరీ పార్టీ స‌మావేశంలో ఆయ‌న ఈ విష‌యాన్ని తెలిపారు. మ‌రోవైపు రాజ్యసభలో ఓ సభ్యుడు పిల్లలకు వ్యాక్సినేష‌న్ గురించి ప్రశ్నించగా..ఆ స‌మ‌యంలో సైతం మంత్రి స‌మాధానం చెప్పబోయారు. కానీ సభలో గందరగోళం మధ్య జవాబు చెప్పలేకపోయారు. ప్రస్తుతం దేశంలో చిన్నారులపై రెండు కోవిడ్ వ్యాక్సిన్లతో ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. భారత్ బయోటెక్, జైడ‌స్ క్యాడిలా అభివృద్ది చేసిన వ్యాక్సిన్లతో ట్రయల్స్ నిర్వహిస్తున్నారు. భార‌త్ బ‌యోటెక్ సంస్థ 2 నుంచి 18 ఏళ్ల మ‌ధ్య ఉన్న పిల్లలపై ఇప్పటికే.. రెండ‌ు, మూడ‌వ ద‌శ ట్రయల్స్ నిర్వహిస్తోంది. జైడస్ క్యాడిలా 12 నుంచి 18 ఏళ్ల మ‌ధ్య పిల్లలపై ట్రయల్స్ నిర్వహిస్తోంది. అయితే.. ఈ రెండు వ్యాక్సిన్ల ఫ‌లితాల ఆధారంగా పిల్లలకు వ్యాక్సినేష‌న్ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఇటీవ‌ల లోక్‌స‌భ‌లో కేంద్ర ఆరోగ్య శాఖ స‌హాయ మంత్రి భార‌తి ప‌వార్ సైతం వెల్లడించారు. దేశ‌వ్యాప్తంగా పాఠశాలలు పున:ప్రారంభం కానున్న నేప‌థ్యంలో.. పిల్లలకు కోవిడ్ వ్యాక్సిన్ ఇచ్చేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.

- Advertisement -

ప్రముఖ సినీనటి జయంతి కన్నుమూత

 

Tags; Vaccines for infants after August

Leave A Reply

Your email address will not be published.

Translate »
You cannot copy content of this page